మన పూర్వికులు ఎక్కువ రోజులు ఎలా జీవించారో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ కాలం జీవించాలని ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది.అయితే మీరు మీ జీవనశైలిలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

 Do You Know How Our Ancestors Lived For Longer Days , Chamomile Tea, Health , He-TeluguStop.com

ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే వ్యక్తులు ఆరోగ్యకరమైన ఆహారం, నిద్ర వేళలను కచ్చితంగా కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి నిద్ర ప్రణాళిక ఎంతో అవసరం.

ప్రతి రోజు ఒకే సమయంలో నిద్ర పోవడం మేలుకోవడం వంటి స్థిరమైన నిద్ర ప్రణాళికలను పాటించడం వల్ల మీకు ఎక్కువ కాలం జీవించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

Telugu Chamomile Tea, Ancestorslived, Tips, Longer Days-Telugu Health Tips

అలాగని ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు.ప్రతిరోజు ఒకే సమయంలో నిద్ర పోవాలి.అలాగే సరైన సమయంలో కచ్చితంగా మేల్కోవాలి.

ఇంకా చెప్పాలంటే కొన్ని అధ్యయనాల ప్రకారం దీర్ఘకాలం జీవించాలనుకుంటే మీ మెదడు శరీరాన్ని పునరుద్ధరించడానికి ప్రతిరోజు రాత్రి 8 గంటల నిద్ర కచ్చితంగా అవసరం.తగినంత నిద్ర మీ మెదడు పనితీరు, రోగనిరోధక శక్తి( Immunity ) స్థాయిలను మెరుగుపరుస్తుంది.

సరైన నిద్ర లేకపోవడం వల్ల మీ మెదడు పనితీరును ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.ఇంకా చెప్పాలంటే విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వేచించాలి.దీనివల్ల మీ మనస్సుకే కాదు శరీరానికి కూడా రోజంతా హాయిగా ఉండేందుకు అవసరమైన విరామం లభిస్తుంది.మీరు దీన్ని ఎలా చేస్తారు.

మీరు ఎక్కడ నివసిస్తున్నారనేది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటుంది.ప్రపంచంలో చాలామంది ప్రజలు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకుంటారు.

వారు క్రమం తప్పకుండా నడవడం, పుస్తకం చదవడం, వెచ్చని చామంతి టీ తాగడం( chamomile tea ), ఆనందంగా ఉండటమే ఎక్కువ కాలం జీవించేందుకు కారణం అని నిపుణులు చెబుతున్నారు.

Telugu Chamomile Tea, Ancestorslived, Tips, Longer Days-Telugu Health Tips

ఇంకా చెప్పాలంటే సుదీర్ఘ జీవితాన్ని గడపడంలో మీ ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా తినకూడదు.సరైన సమయంలో తగినంత తినడం శరీర బరువును ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

మీరు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మీకు నచ్చినట్లుగా తినవచ్చు.కానీ రాత్రి భోజనాన్ని మితంగా తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భోజనం చేయడం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని అధ్యయనాలలో తెలిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube