సాధారణంగా కొందరు చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చేసుకుని ఇతరులపై నిప్పులు చెరుగుతుంటారు.ఆ తర్వాత తొందర పడ్డామ అని బాధ పడుతుంటారు.
ఇక చీటికి.మాటికీ కోపంతో చిందులు వేస్తుంటే.
ఇతరులు కూడా తమపై అసహ్యాన్ని పెంచుకుంటారు.ఒక్కోసారి రిలేషన్స్ సైతం దెబ్బ తింటాయి.
అందుకే ఎవ్వరైనా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.
మరి ఆ ఆహారాలు ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
కమలా పండ్లు రుచిగా ఉండటమే కాదు.
ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి.అయితే కోపాన్ని తగ్గించడంలోనూ ఈ పండ్లు సహాయపతాయి.
అతి కోపంతో బాధ పడే వారు రెగ్యులర్‌గా ఒక కమలా పండు తీసుకుంటే.అందులో ఉండే పోషకాలు మైండ్‌ను, మనసును శాంతింప చేయడంలో హెల్ప్ చేస్తాయి.

అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోపాన్ని అదుపులో ఉంచడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.అందు వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలు, రొయ్యలు, కిడ్నీ బీన్స్, ఆకు కూరలు, అవిసె గింజలు, వాల్ నట్స్, అవకడో పండు, ఫిస్ ఆయిల్, గుడ్డు వంటి ఆహారాలను తీసుకుంటే మంచిది.

అరటి పండుతక్కవు ధరకే లభించినా, పోషకాలు మెండుగా ఉంటాయి.అందుకే ఆరోగ్యానికి అరటి పండు ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా తరచూ కోపంతో ఊగిపోయే వారు రోజుకు ఒక అరటి పండు తీసుకుంటే.అందులో ఉండే పొటాషయం కంటెంట్ మనసును ఎల్లప్పుడు ప్రశాంతగా ఉండేలా చేస్తుంది.
ఇక ఈ ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడమే కాదు కొన్ని ఆహారాలకు దూరంగా కూడా ఉండాలి. నూనెలో వేయించిన ఆహారాలు, పీనట్ బటర్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటిని డైట్‌లో నుంచి కట్ చేయాలి.
అలాగే రోజూ కాసేపు వ్యాయామం, యోగా చేయాలి.వాటర్ అధికంగా తీసుకోవాలి.