టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో పూరీ జగన్నాథ్( Puri Jagannath ) ఒకరు కాగా సోషల్ మీడియాలో సైతం ఈ దర్శకునికి ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.ఈ మధ్య కాలంలో పూరీ జగన్నాథ్ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
అయితే పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి( Vijay Sethupati ) కాంబోలో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది జూన్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
అయితే పూరీ జగన్నాథ్ ఔట్ డేటెడ్ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా ప్రముఖ నటుడు శాంతను భాగ్యరాజ్( Shantanu Bhagyaraj ) ఆ కామెంట్ కు రియాక్ట్ కావడం జరిగింది.నెటిజన్ తన పోస్ట్ లో పూరీ జగన్నాథ్ ఔట్ డేటెడ్ అయ్యారని మహారాజ సినిమా( Mahaaraja Movie ) హిట్ తర్వాత విజయ్ సేతుపతి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నటించడానికి ఎందుకు ఓకే చెప్పారంటూ నెటిజన్ కామెంట్ చేయగా ఆ కామెంట్ హాట్ టాపిక్ అవుతోంది.

శాంతను భాగ్యరాజ్ రియాక్ట్ అవుతూ ఇండస్ట్రీలో వ్యక్తుల గురించి అలా మాట్లాడవద్దని ఆయన అన్నారు.సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే సమయంలో సరైన పదాలు వాడటం నేర్చుకోవాలని శాంతను భాగ్యరాజ్ వెల్లడించారు.పూరీ జగన్నాథ్ ఒక ప్రముఖ దర్శకుడని ఆయనకు గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు.మీలాంటి వారి నుంచి ఇలాంటివి ఊహించలేదని ఆయన పేర్కొన్నారు.

ఆ తర్వాత నెటిజన్ క్షమాపణలు చెప్పి తన పోస్ట్ ను డిలీట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.పూరీ జగన్నాథ్ సినిమాలన్నీ సొంత బ్యానర్ లోనే తెరకెక్కుతుండటం గమనార్హం.పూరీ జగన్నాథ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.పూరీ జగన్నాథ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.