మనం గుడికెళ్లినప్పుడు ప్రదక్షిణాలు చేస్తాం.సాధారణంగా మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా మనకు నచ్చినట్టుగా ప్రదక్షిణాలు చేస్తాం.
కొందరు దేవుడా నీ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తా నా కోరిక తీర్చు అని వేడుకుంటుంటారు.ఫలానా గుడిలో పదకొండు ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందట.
ఇలాంటివి ఎన్నో వింటుంటాం.కాని అసలు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి.
ఆ ప్రదక్షిణాల విశిష్టత ఏంటి తెలుసుకుందాం.
దేవుడి చుట్టూ ప్రదక్షిణం మూడు సార్లే చేయాలి.
ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తే మన కోరిక తీరుతుందనేది మన భ్రమ,.కొందరు దేవుడు చుట్టు ఇన్ని ప్రదక్షిణాలు చేస్తాం అని మొక్కుకున్నాం అంటుంటారు.
మొక్కుబడి తీరిస్తేనే కోరికలు తీరతాయనేది మన భ్రమ అని పెద్దలు చెప్తున్నారు.కేవలం మూడు ప్రదక్షిణాల ద్వారానే మనకు త్రిగుణాత్ముడైన శివుడి దర్శనం లభిస్తుందట.
ఆ మూడు ప్రదక్షిణాలకు మూడు లక్షణాలున్నాయి.అవేంటో తెలుసుకుని ఈ సారి గుడికెళ్లినప్పుడు ఆచరించండి.
1.మొదటి ప్రదక్షిణ చేసి తమో గుణం వదిలేయాలి.క్రౌర్యం,నిద్ర,బద్దకం వదిలేయాలి.క్రమశిక్షణ కలిగి ఉండాలి.
2.రెండో ప్రదక్షిణ రజో గుణం వదిలేయాలి.ఇతరులతో పోటీలు పడడం,ఇతరుల పట్ల కోపం,పగ,ద్వేషాలు వదిలేయాలి.
3.మూడో ప్రదక్షిణం చేసి సత్వగుణం వదిలేయాలి.అందరి కంటే నేనే గొప్ప,నేనే మంచోణ్ని,నా అంత అనే లక్షణాలను వదిలేయాలి.