టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) తాజాగా గుంటూరు కారం సినిమాతో( Guntur Karam movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas )దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా ఇదే.కాగా ఇందులో శ్రీలీలా, మీనాక్షి చౌదరిలు( Srileela , Meenakshi Chaudhary ) హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.జనవరి 12న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను భారీగా నిరాశపరిచింది.అయినప్పటికీ ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితం అవుతూ దూసుకుపోతోంది.

కాగా ఈ సినిమాకు మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ అంతకంతకూ పెరగడంతో 5వ రోజుకు కూడా రెండంకెల పైనే వసూళ్లు సాధించడమే కాకుండా ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం గానీ రికార్డును మహేశ్‌బాబు సొంతం చేసుకున్నాడు.తొలి రోజునే రూ.94 కోట్ల వసూళ్లను సాధించి రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది.దీంతో టాలీవుడ్లో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఏకైక హీరోగా మహేశ్ బాబు చరిత్ర సృష్టించాడు.

వరుసగా 5 చిత్రాలు భరత్ అనే నేను మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, ఇప్పుడు గుంటూరు కారం చిత్రాలు 100 కోట్లకు పైగా షేర్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద మహేశ్ స్టామినాను మరోసారి నిరూపించాయి.కాగా మహేష్ బాబు సినిమాను కొంతమంది ప్రేక్షకులు పరవాలేదు అంటుండగా మరి కొంతమంది మాత్రం ఈ సినిమా భారీగా నిరాశపరిచిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే నెగటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రికార్డులు సృష్టించడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించారు హీరో మహేష్ బాబు.