ధూమపానం( Smoking ) ఆరోగ్యానికి హానికరం అని దాదాపు చాలా మందికి తెలుసు.అయినా ఆ విషయాన్ని ఎవరు అంతగా పట్టించుకోకుండా ఎన్నో రకాల ఆనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు.
సిగరెట్, బీడీ, పొగాకు వంటి వాటిని పీల్చడం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.వాటి పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు, కాలేయం పూర్తిగా దెబ్బతింటాయని గుండె సమస్యల( Heart problems )కు, క్యాన్సర్ ప్రమాదానికి కారణం అవుతాయని చెబుతున్నారు.
ఈ విషయాలన్నీ తెలిసి కూడా వీటికి బానిసనులుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు.

కొందరు ధూమపానం చేయకుండా ఉండాలని దృఢంగా నిర్ణయించుకున్న తర్వాత యధావిధిగా ఆ పని చేస్తూ ఉంటారు.వారికి మానుకోవాలని ఆలోచన కలిగిన ఆలా చేయలేకపోతుంటారు.అలాంటి వారు కొన్ని రకాల యోగాసనాలను చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ఈ ఆసనాల కారణంగా ఆరోగ్యం మెరుగు పడడంతో పాటు ధూమపానం అనే అలవాటును కూడా వదిలించుకోవచ్చు.అందుకోసం మీరు ఏ ఏ ఆసనాలను వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే బాలసనం ( Balasanam )మనసు శాంత పరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ధూమపానం మానేయాలని ఆలోచన వస్తుంది.

ఇలా క్రమంగా చేయడం వల్ల మీరు పొగ తాగే అలవాటును విడిచిపెట్టడంలో విజయం సాధిస్తారు.ఇంకా చెప్పాలంటే సర్వంగాసనం( Sarvangasanam ) వేయడం ద్వారా శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.ఇంకా మీ పై ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడంలో, నిరాశను తొలగించడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది.ఈ ఆసనం మీకు ధూమపాన వ్యసనాన్ని వదిలించుకోవడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా భుజంగాసనం( Bhujangasana ) శ్వాసక్రియను ప్రోత్సహించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే మనిషిలోని ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఈ ఆసనం ఛాతీని దృఢంగా చేస్తుంది.ఇంకా అలసట ను తగ్గించడంలో, రక్త ప్రసరణను నియంత్రించడంలో, ఆందోళనని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.