ముఖమెంత తెల్లగా అందంగా ఉన్నప్పటికీ చాలా మందికి మోచేతులు మాత్రం నల్లగా అందవిహీనంగా కనిపిస్తుంటాయి.మోచేతుల నలుపు( Dark Elbows ) కారణంగా కొందరు తీవ్ర అసహనానికి గురవుతుంటారు.
ఆ నలుపును పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ తో మోచేతుల నలుపును సులభంగా పోగొట్టుకోవచ్చు.
మోచేతులను అందంగా, మృదువుగా మెరిపించుకోవచ్చు.
తులసి ఆయిల్( Tulsi Oil ) మోచేతుల నలుపును పోగొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
అందుకోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె( Coconut Oil ) పోసుకోవాలి.ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు ఎండిన తులసి ఆకులు వేసి చిన్న మంటపై దాదాపు పది నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను ఫిల్టర్ చేసి చల్లారబెట్టుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఈ తులసి ఆయిల్ ను మోచేతులకు అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.
రెగ్యులర్ గా ఇలా చేశారంటే మోచేతుల నలుపు క్రమంగా మాయమవుతుంది.అక్కడి చర్మం మృదువుగా అందంగా మారుతుంది.

మోచేతుల నలుపును పోగొట్టడానికి మరొక సూపర్ రెమెడీ ఉంది.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, వన్ టీ స్పూన్ వంట సోడా మరియు రెండు మూడు టేబుల్ స్పూన్లు పచ్చిపాలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసుకుని పదినిమిషాలు పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై నిమ్మ చెక్కతో మోచేతులును రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ విధంగా చేశారంటే నలుపు వదిలిపోయి మోచేతులు తెల్లగా మృదువుగా మారుతాయి.

ఇక మోచేతుల నలుపును పోగొట్టుకోవాలి అని భావించేవారు రోజు కచ్చితంగా బాత్ అనంతరం మాయిశ్చరైసర్ అప్లై చేసుకోవాలి.అలాగే మోచేతులపై ఒత్తిడి, ఎక్కువ రాపిడి లేకుండా కూడా చూసుకోవాలి.







