ముఖ్యంగా చెప్పాలంటే పితృపక్షా సమయంలో గాయలో( Gaya ) పిండ దానం సమర్పించడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.మత గ్రంధాల ప్రకారం భూమి పై ఉన్న అన్ని తీర్థయాత్రలలో గయా ఉత్తమమైన తీర్థయాత్ర అని గరుడ పురాణం లో( Garuda Puranam ) ఉంది.
ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశం, విదేశాల నుంచి లక్షణాది మంది అతిధులు 15 రోజుల వ్యవధిలో గాయలో పిండం ప్రధానం, తర్పణం, కర్మలు చేయడానికి వస్తూ ఉంటారు.ఇక్కడ మానవ ఆత్మకు విముక్తి మోక్షం లభిస్తుంది.
ఈ సంప్రదాయం తరతరాలుగా వస్తూ ఉంది.
అలాగే గాయాసురుడు( Gayasurudu ) అనే రాక్షసుడు తపస్సు చేసి భగవంతుని అనుగ్రహం పొందుతాడు.
కానీ అతను వరాన్ని దుర్వినియోగం చేసి దేవతలను ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాడు.దీంతో గాయాసురుని నుంచి తమను రక్షించమని దేవతలు విష్ణువును( Mahavishnu ) ప్రార్థిస్తారు.అప్పుడు విష్ణుమూర్తి గాయను తన గదతో సంహరించాడు.ఆ తర్వాత గాయాసురుని తలపై రాయి పెట్టి మోక్షాన్ని ప్రసాదిస్తాడు.
ఆ రాయి ఇప్పటికీ గాయాలో ఉన్న విష్ణు పాద దేవాలయంలో ఉంది.శ్రీ మహా విష్ణువు గాయాసురుడిని తన గధతో చంపినప్పుడు గాయతీర్థంలో రక్షకుడిగా పరిగణించారు.
గాయాలో ఫల్గు నదిలో స్నానం చేసి ప్రార్థనలు చేయడం ద్వారా దివ్య స్థితిని పొందుతారు.గయలో పిండ దానం( Pind Daan ) చేయడం ద్వారా ఏడు తరాల పూర్వికులు మోక్షాన్ని పొందుతారని హిందూ సంప్రదాయం బలంగా నమ్ముతుంది.గయలో శ్రద్ధా, తర్పణం, పిండా దానం చేయడం వల్ల ఒక వ్యక్తి స్వర్గన్ని పొందుతాడు.ఇక్కడ పూర్వీకులకు ఏది సమర్పించిన ఆది శాశ్వతమైనది.గయలో పిండ ప్రదానం సమర్పించడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు.
కర్మలు కాకుండా ఏదైనా జంతువు, దొంగ, పాము లేదా జంతువులు కాటు కారణంగా ఎవరైనా మరణిస్తే ఆ చనిపోయిన వారిని గాయాతీర్థంలో శ్రాద్ధం చేయడం వల్ల అతను బంధం విముక్తి పొంది స్వర్గానికి వెళ్తాడు.గాయాలో పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా శ్రద్ధ కర్మలు, తర్పణాలు చేయవచ్చు.కాబట్టి గాయతీర్థంలో చనిపోయిన వ్యక్తి శ్రాద్ధం చేయడం వల్ల అతను బంధం నుంచి విముక్తి పొంది స్వర్గానికి వెళ్తాడని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL