మెంతాకు చేసే మ్యాజిక్ ఇది.. ఈ విధంగా జుట్టుకు పూస్తే బోలెడు లాభాలు!

మెంతాకు.( Fenugreek leaves ) దీనిని మెంతికూర అని కూడా పిలుస్తుంటారు.ఆకుకూరల్లో మెంతాకు అమోఘమైనది.మెంతాకు తో చాలా ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తుంటారు.ఆంధ్రాలో అయితే మెంతాకు ప‌ప్పు చాలా మంది ఫేవ‌రెట్ డిష్‌.తక్కువ ధరే అయినప్పటికీ మెంతాకు లో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

 Amazing Benefits Of Fenugreek Leaves For Hair! Methi Leaves, Fenugreek Leaves, F-TeluguStop.com

అందుకే ఆరోగ్య పరంగా మెంతాకు మనకు అనేక ప్రయోజనాల‌ను చేకూరుస్తుంది.ఎన్నో జ‌బ్బుల‌కు అడ్డుక‌ట్ట వేస్తుంది.

అలాగే జుట్టు సంరక్షణకు కూడా మెంతాకు అద్భుతంగా సహాయపడుతుంది.ఇప్పుడు చెప్పబోయే విధంగా మెంతాకు ను జుట్టుకు పూస్తే బోలెడు లాభాలు పొందొచ్చు.

Telugu Dandruff, Fenugreek, Fenugreek Pack, Care, Care Tips, Latest, Long, Methi

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ మెంతాకు వేసుకోవాలి.అలాగే రెండు రెబ్బలు వేపాకు, రెండు మందారం ఆకులు( Hibiscus leaves ) రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) వేసుకోవాలి.చివ‌రిగా ఒక కప్పు వాటర్ పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Dandruff, Fenugreek, Fenugreek Pack, Care, Care Tips, Latest, Long, Methi

గంట లేదా గంటన్నర అనంతరం కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూ ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.తలలో చుండ్రు సమస్య( Dandruff ) దూరం అవుతుంది.స్కాల్ప్ లోతుగా శుభ్రం అవుతుంది.జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్ గా మారతాయి.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

కురులు ఒత్తుగా పెరుగుతాయి.చాలా మంది డ్రై హెయిర్ సమస్యతో బాగా సతమతం అవుతుంటారు.

జుట్టును సిల్కీగా మార్చుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.అయితే ఈ రెమెడీని పాటిస్తే సహజంగానే మీ జుట్టు సిల్కీగా స్మూత్ గా మారుతుంది.

మ‌రియు ఈ రెమెడీ ద్వారా పొడవాటి జుట్టును కూడా పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube