టీనేజ్ మొదలైందంటే చాలు దాదాపు ప్రతి ఒక్క అమ్మాయినీ ప్రధానంగా ఇబ్బంది పెట్టే సమస్య మొటిమలే.శరీరంలోని హార్మోన్లలో జరిగే మార్పుల కారణంగా మొటిమలు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.
ఏదేమైనా ఆ వయసులో వచ్చే మొటిమల వల్ల చాలా మంది అమ్మాయి ఒకింత అసహనానికి గురవుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలను తీసుకుంటే గనుక టీనేజ్‌లో మొటిమలు దరి చేరనే చేరవు.
మరి ఆ జాగ్రత్తలు ఏంటీ లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
మొటిమలు రాకుండా అడ్డు కట్ట వేయడంలో ప్రోటీన్ అద్భుతంగా సహాయపడుతుంది.
అందు వల్ల, ప్రతి రోజు శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌ను అందించాలి.అందు కోసం గుడ్డు, చేపలు, గ్రీన్ పీస్, బాదం పప్పు, పుచ్చ గింజలు వంటివి వాటిని డైట్‌లో చేర్చుకోవాలి.
టీనేజ్‌లో మొటిమలకు దూరంగా ఉండాలీ అనికుంటే వారానికి ఐదు రోజు తప్పని సరిగా వ్యాయామాలు లేదా యోగా చేయాలి.తద్వారా ఆరోగ్యం మెరుగ్గా మారడంతో పాటు శరీరంలోని హార్మోన్లు సమతుల్యం అవుతాయి.ఫలితంగా మొటిమలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
అలాగే యుక్త వయసులో మొటిమలతో తరచూ బాధ పకుండా ఉండాలనుకుంటే పసుపును ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.
పసుపులో ఉండే శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మొటిమలను కలగచేసే బాక్టీరియాను, విష పదర్ధాలను బయటకు నెట్టి వేస్తాయి.

ప్రాసెస్ చేసిన బేకరీ ఫుడ్స్, చక్కెరతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల ఇన్సులిన్‌ను పెంచి మొటిమలు ఏర్పడేలా చేస్తాయి.కాబట్టి, ఆయా ఆహారాలను తీసుకోవడం మానేయాలి.
ఇక టీనేజ్‌లో మొటిమల సమస్య ఉండకూడదంటే ఒత్తిడిని తగ్గించుకుని కండి నిండా నిద్ర పోవాలి.
కెమికల్స్‌తో నిండి ఉండేవి కాకుండా న్యాచురల్ స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్‌నే వినియోగాలి.బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్ స్క్రీన్‌ను యూజ్ చేయాలి.