పొట్ట ఎంత శుభ్రంగా ఉంటే ఆరోగ్యం అంత బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.పొట్టలో వ్యర్థాలు పేరుకుపోయే కొద్దీ జీర్ణ వ్యవస్థ పని తీరు దెబ్బ తింటుంది.
క్రమంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందుకే పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు.
అయితే పొట్టను శుభ్రపరచడంలో ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.పైగా ఈ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ సైతం లభిస్తాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం పొట్టను శుభ్రపరిచే ఆ జ్యూస్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలను వేసుకుని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
ఆ తర్వాత ఒక యాపిల్ ను తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లండర్ ను తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న అవిసె గింజలు, కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ముక్కలు, పీల్ తొలగించిన చిన్న అల్లం ముక్క, చిటికెడు నల్ల ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల తేనె, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, ఒక గ్లాసు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పొట్టను శుభ్రపరిచే సూపర్ జ్యూస్ సిద్ధమయినట్టే.
ఈ జ్యూస్ ను ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌కు గంట ముందు తీసుకోవాలి.తద్వారా పొట్టలో పేరుకు పోయిన వ్యర్ధాలు తొలగిపోతాయి.పొట్ట క్లీన్ గా మారుతుంది.తద్వారా జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది.అదే సమయంలో ఈ జ్యూస్‌ను రోజు ఉదయాన్నే తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.వెయిట్ లాస్ అవుతారు.
ఎముకలు దృఢంగా మారతాయి.మరియు వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ సైతం తగ్గముఖం పడుతుంది.