ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎందరో మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలను విడుస్తున్నారు.ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.
అటువంటి ఆహారాల్లో హిమాలయన్ వెల్లుల్లి కూడా ఒకటి.అయితే ఈ హిమాలయన్ వెల్లుల్లి గురించి చాలా మందికి అవగాహనే లేదు.
హిమాలయాల్లో ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే ఈ వెల్లుల్లిని జమ్మూ వెల్లుల్లి అని, కాశ్మీరీ వెల్లుల్లి అని కూడా పిలుస్తాంటారు.
పిలుపు ఏదైనా హిమాలయన్ వెల్లుల్లిలో మాత్రం బోలెడన్ని ఔషధ గణాలు దాగి ఉంటాయి.
అందుకే ఈ హిమాలయన్ వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం హిమాలయన్ వెల్లుల్లిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటో చూసేయండి.

హిమాలయన్ వెల్లుల్లికి క్యాన్సర్ వచ్చే రిస్క్‌ను యాబై శాతం తగ్గించగలిగే సామర్థ్యం ఉంది.అవును, హిమాలయన్ వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకుంటే అందులో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషక విలువలు శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డ కట్ట వేస్తాయి.
అలాగే హిమాలయన్ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్‌గా మారి జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
ఆస్తమా లక్షణాల నుంచి విముక్తి లభిస్తుంది.అంతే కాదు, హిమాలయన్ వెల్లుల్లిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.రక్త పోటు స్థాయిల్లో హెచ్చు తగ్గులు ఏర్పడకుండా ఉంటాయి.వెయిట్ లాస్ అవుతారు.
బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి పోయి గుండె ఆరోగ్యంగా మారుతుంది.మరియు లివర్ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడతాయి.