టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ( Hero Ram Charan )హీరోగా నటించిన చిత్రం గేమ్ ఛేంజర్( Game changer ).శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
సంక్రాంతి పండుగ కానుకగా విడుదల అయిన అభిమానులను దారుణంగా నిరాశపరిచింది.ఈ సినిమా మీద పెరిగిన అంచనాల్ని, సినిమాలోని కథ, తెరకెక్కించిన తీరుకి ఏ మాత్రం సంబంధం లేకుండా పోయింది.
దీంతో గేమ్ ఛేంజర్ థియేటర్లో డిజాస్టర్‌గా నిలిచింది.వందల కోట్ల నష్టం వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఈ కథను అందించింది కార్తిక్ సుబ్బరాజ్.( Karthik Subbaraju ) గేమ్ ఛేంజర్ రిలీజ్ కు ముందు చాలా గొప్పగా చెప్పుకున్న కార్తిక్ సుబ్బరాజ్, ఇప్పుడు పూర్తిగా స్వరం మార్చేశాడు.గేమ్ ఛేంజర్ కథ అద్భుతంగా ఉంటుందని, అయితే ఆ స్థాయి కథను తాను హ్యాండిల్ చేయలేనని, ఇది తన స్థాయిని మించిన సినిమా అని ప్రారంభంలో కార్తిక్ సుబ్బరాజ్ చెప్పుకొచ్చాడు.అది శంకర్ గారి స్టైల్లో ఉండేదని, అందుకే ఆ కథను ఆయనకే ఇచ్చానని కార్తిక్ సుబ్బరాజ్ అన్నాడు.
గేమ్ ఛేంజర్ రిలీజ్ కు ముందు ఆ కథ మీద, సినిమా మీద చాలా నమ్మకం ఉందని, అద్భుతంగా ఉంటుందని అన్నారు.కానీ ఇప్పుడు మాత్రం గేమ్ ఛేంజర్ కథను తాను రాయలేదని, కేవలం వన్ లైన్ మాత్రమే చెప్పానని అంటున్నాడు.

ఆ వన్ లైనర్ కే అంత ఎగ్జైట్ అయిపోయి అది తన రేంజ్ కాదని, శంకర్ రేంజ్ కథ అని కార్తిక్ సుబ్బరాజ్ ఫిక్స్ అయ్యాడా? అని అందరికీ అనుమానం కలగకమానదు.గ్రౌండెడ్‌గా ఉండే ఓ ఐఏఎస్ ఆఫీసర్ అని తాను ఓ వన్ లైనర్ పాయింట్, కథని అనుకున్నాడట.అది శంకర్‌కి ఇచ్చాడట.ఆ తరువాత ఆ కథలోకి చాలా మంది రైటర్లు వచ్చారని, కథ మారిందని, స్క్రీన్ ప్లే కూడా మారిందని, మొత్తం మారిందని కార్తిక్ సుబ్బరాజ్ ఇప్పుడు చెబుతున్నాడు.
అప్పుడేమో గొప్పగా చెప్పుకుని ఇప్పుడు మాత్రం అది తన కథ కాదన్నట్టుగా చేతులు దులుపుకుంటున్నాడు కార్తిక్ సుబ్బరాజ్.