వెల్లుల్లి పొట్టు ప‌నికిరాద‌ని పారేస్తున్నారా.. అయితే ఈ పోష‌కాల‌న్నీ మీరు కోల్పోతున్న‌ట్లే!

కొన్ని దశాబ్దాల కాలం నుంచి వంటల్లో వెల్లుల్లి ఒక భాగం అయ్యింది.ప్రత్యేకమైన రుచి మరియు వాసన కలిగి ఉండటం కారణంగా వెల్లుల్లి( Garlic )ని దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో విరివిరిగా వాడుతుంటారు.

 Do You Throw Away Garlic Peels? Garlic Peels, Garlic Peel Health Benefits, Lates-TeluguStop.com

కూర‌ల నుంచి ప‌చ్చ‌ళ్ల వ‌ర‌కు అనేక ర‌కాల వంట‌ల్లో వెల్లుల్లిని ఉప‌యోగిస్తారు.అధిక యాంటీ ఆక్సిడెంట్స్‌ మరియు అల్లిసిన్ వంటి క్రియాశీల సమ్మేళనాల కారణంగా వెల్లుల్లి ప‌లు ఔషధాలలో శక్తివంతమైన మూలికగా కూడా ఉపయోగించబడింది.

అయితే చాలా మంది చేసే పొర‌పాటు ఏంటంటే.వెల్లుల్లిని వాడే క్ర‌మంలో దాని పొట్టు తీసి పారేస్తుంటారు.

వెల్లుల్లి పొట్టు ఎందుకు ప‌నికిరాద‌ని భావిస్తుంటారు.

Telugu Garlic, Garlicpeel, Garlic Peels, Tips, Immunity, Latest-Telugu Health

అయితే నిజానికి వెల్లుల్లి మాత్ర‌మే కాదు వెల్లుల్లి పొట్టు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.వెల్లుల్లి పొట్టును పారేస్తే.మీరు విటమిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, పొటాషియం, కాల్షియం, భాస్వరం, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాల‌ను మీరు కోల్పోతున్నట్లే.

అందువ‌ల్ల వెల్లుల్లి పొట్టును పారేయ‌కుండా వాడేయ‌డ‌మే ఉత్త‌మం.వెల్లుల్లిని పేస్ట్ చేసే క్ర‌మంలో పొట్టుతో పాటే గ్రైండ్ చేసుకోవాలి.వెల్లుల్లి పొట్టుతో టీ త‌యారు చేసుకుని కూడా తీసుకోవ‌చ్చు.వాట‌ర్ లో వెల్లుల్లి పొట్టు వేసి ప‌ది నిమిషాల పాటు మ‌రిగించి వ‌డ‌క‌డితే టీ సిద్ధం అవుతుంది.

వెల్లుల్లి పొట్టు టీ జలుబు మరియు ఫ్లూ వంటి స‌మ‌స్య‌ల‌కు సహజ నివారణగా ఉపయోగప‌డుతుంది.ఈ టీ తాగితే జ‌లుబు, ద‌గ్గు( Cold, cough ), గొంతు నొప్పి, గొంతు వాపు వంటివి ప‌రార్ అవుతాయి.

నిద్రలేమితో బాధ‌ప‌డుతున్న వారికి కూడా వెల్లిల్లి పొట్టు టీ ఔష‌ధంలా ప‌ని చేస్తుంది.రోజుకు ఒక క‌ప్పుడు వెల్లుల్లి పొట్టు టీ తీసుకుంటే నాణ్య‌మైన నిద్ర‌ను పొందుతారు.

Telugu Garlic, Garlicpeel, Garlic Peels, Tips, Immunity, Latest-Telugu Health

అంతేకాదు, వెల్లుల్లి పొట్టులో మెండుగా ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క శ‌క్తి( Immunity )ని పెంచుతుంది.సీజ‌న‌ల్ వ్యాధుల‌ను అడ్డుకునే సామ‌ర్థ్యాన్ని చేకూరుస్తుంది.వెల్లుల్లి పొట్టు అధిక కొలెస్ట్రాల్ స‌మ‌ర్థవంతంగా క‌రిగిస్తుంది.గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ ను త‌గ్గిస్తుంది.వెల్లుల్లిని పొట్టుతో పాటుగా తింటే ఎముక‌లు దృఢంగా ఉంటాయి.ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం త‌గ్గుముఖం ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube