జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడిని సినీతారలు ఖండిస్తున్నారు.ఈ ఉగ్ర దాడిలో భాగంగా సుమారు 28 మంది వరకు మరణించిన విషయం తెలిసిందే.
మినీ స్విజర్లాండ్(Mini Switzerland) గా పిలుచుకొని ఈ పర్యాటక ప్రాంతానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎన్నో జ్ఞాపకాలను తమ వెంట తీసుకు వెళ్తూ ఉంటారు.అయితే ఇప్పుడు జరిగిన ఈ ఉగ్ర దాడిలో పర్యాటకులకు విషాదం మాత్రమే మిగిలిందని చెప్పాలి.
ఇక ఈ ఉగ్రదాడిపై సినీ సెలెబ్రిటీలు స్పందిస్తూ పూర్తిస్థాయిలో ఖండిస్తున్నారు.తాజాగా ఈ ఘటనపై సినీనటి సాయి పల్లవి కూడా స్పందించారు.
ఈ సందర్భంగా సాయి పల్లవి ఈ ఘటన గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…పహల్గాం దాడిలో (pahalgam terror attack)జరిగిన నష్టం, కలిగిన బాధ, ఏర్పడిన భయం నాకు వ్యక్తిగతంగా జరిగినట్లు అనిపిస్తోంది.గతంలో జరిగిన భయంకరమైనటువంటి నేరాల గురించి తెలుసుకుని.
ఇప్పటికీ అలాంటి అమానవీయ చర్యలకు సాక్షిగా ఉండడం వల్ల.అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఏమి మారలేదని అర్థమవుతుంది.
ఆ జంతువుల సమూహం మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి ఆశను తుడిచిపెట్టేసింది.కుటుంబంతో జ్ఞాపకాలను సృష్టించాలనుకునే మనస్తత్వం నుండి, మీ ఎమోషన్స్, మీ కుటుంబం మీ ముందే కోల్పోవడం చూడడం వరకు.
ఇది నన్ను మన మూలాన్ని ప్రశ్నించేలా చేస్తుంది.నిస్సహాయంగా, శక్తిహీనులుగా, కోల్పోయిన అమాయక జీవితాలు, వేదనకు గురైన కుటుంబాల కోసం నా హృదయపూర్వక సంతాపాన్ని , ప్రార్థనలను అందిస్తున్నాను ‘ అంటూ ట్వీట్ చేసింది.

ఈ విధంగా సాయి పల్లవి ట్వీట్(Sai Pallavi’s tweet) చేయడంతో ఈమెకు సంబంధించిన ఒక పాత వీడియోని వైరల్ చేస్తూ నేటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఆ వీడియోలో ఈమె ఇండియన్ ఆర్మీ పాకిస్తానీ ఆర్మీలను ఉగ్రవాదులుగా చూస్తుంది.అలాగే పాకిస్తానీ ఆర్మీ ఇండియా వారిని (Pakistani Army India)ఉగ్రవాదులుగా చూస్తుంది.ఇదే హింసకు దారితీస్తుంది.మనం ఆలోచించే విధానం అలాంటిది అంటూ ఈమె గతంలో మాట్లాడిన మాటలు పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.