సోషల్ మీడియా రోజుకో వైరల్ వీడియో( Viral Video ) ట్రెండ్ లో ఉంటుంది.అందులో ప్రత్యేకంగా ఏనుగుల వీడియోలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
సాధారణంగా ఏనుగులు( Elephants ) శాంత స్వభావానికి ప్రసిద్ధి.కానీ, ఆ శాంత స్వభావం ఒక్కసారి కోపంగా మారితే మాత్రం పరిసరాల్లో ఓ రకమైన బీభత్సం నెలకొంటుంది.
ఎవరైనా వాటికి ఆటంకం కలిగించగానే అవి విరుచుకుపడతాయి.అలాంటి ఘటనే తాజాగా మైసూరులో( Mysore ) చోటు చేసుకుంది.
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు రోడ్డుపై ఇద్దరు యువకులు కారులో ప్రయాణిస్తూ వెళ్తున్నారు.మార్గమధ్యంలో వారికి అడవిలో సంచరిస్తున్న ఏనుగు కనిపించింది.అది కాస్త సమీపంలో ఉండటంతో ఉత్సాహంతో వారు కారును ఆపి దానిని దగ్గరగా చూడాలని నిర్ణయించుకున్నారు.కానీ, ఇది వారి జీవితంలో ఓ భయానక అనుభవానికి దారితీసింది.
వారు కారులో నుంచి దిగి ఏనుగును దగ్గరగా చూస్తుండగానే.ఆ ఏనుగు ఒక్కసారిగా వారిని తరిమింది.
రోడ్డుపైనే వారి వెనకే పరుగెడుతూ వచ్చేసింది.దానితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారు పరుగులు తీసారు.
ఈ క్రమంలో ఒక యువకుడు కింద పడ్డాడు.దానితో అతనిపై ఏనుగు వెనుక కాళ్లతో తన్నేసింది.అదృష్టవశాత్తు ఏనుగు అతన్ని తొక్కకుండా వదిలిపెట్టింది.ఆ తర్వాత తీవ్ర భయంతో అతను అక్కడినుంచి పాకుతూ పారిపోయాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.నెటిజన్లు భయ్యా నీకు ఇంకా భూమి మీద గడిపి టైం మిగిలి ఉంది అని కొందరు కామెంట్ చేస్తుంటే.
మరికొందరు మాత్రం చావు అంచులదాకా వెళ్లి రావడమంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.