ఇండియాలో ఇప్పటివరకు ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి ప్రభాస్( Prabhas ) కి ఉన్న గుర్తింపు మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ప్రభాస్ రాజాసాబ్( Rajasaab ) సినిమాని చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు.
ఇక దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వం లో చేస్తున్న ఫౌజీ సినిమాకు( Fauji Movie ) సంబంధించిన డేట్స్ ని కూడా కేటాయించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఇప్పటివరకు ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి.
దాదాపు 40% షూట్ ని కూడా కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.కానీ తను అనుకున్నట్టుగానే ఇకమీదట సినిమాలను చాలా తొందరగా చేసేసి సంవత్సరానికి ఒక సినిమానైనా సరే రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి ఇప్పటివరకు మన స్టార్ హీరోలందరు రెండు సంవత్సరాలకు సినిమా చేస్తూ చాలా బిజీగా గడుపుతున్న క్రమంలో ప్రభాస్ సంవత్సరానికి ఒకటి నుంచి రెండు సినిమాలను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.అతను అనుకున్నట్టుగానే సినిమా షూటింగ్ లో పాల్గొని శరవేగంగా సినిమాను పూర్తి చేస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారాబోతున్నాయి.

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఆయనను మించిన స్టార్ హీరో అయితే కనిపించడం లేదు.కాబట్టి రాబోయే సినిమాలతో సక్సెస్ లను సాధించి ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదగాలనే ఉద్దేశ్యం తో ఉన్నాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.