నయనతార( Nayanthara )… లేడీ సూపర్ స్టార్ గా తమిళనాడుతో పాటు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా ఎదిగి కుర్ర కారు హృదయాలను కొల్లగొట్టిన నటి.సాధారణంగా ఏ హీరోయిన్ లైఫ్ స్పాన్ అయినా ఇండస్ట్రీలోకి వచ్చేసరికి దాదాపు 5 నుంచి 10 ఏళ్లు మాత్రమే ఉంటుంది.
మహా అయితే మరో రెండేళ్లు కానీ వీటన్నిటికన్నా కూడా చాలా భిన్నమైన రీతిలో కెరియర్ ను కొనసాగిస్తోంది నయన్.నయనతార ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 18 సంవత్సరాలు అయింది అయినా కూడా ఆమె ఇప్పటికీ ఎప్పటికీ ఒక స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతూ ఉండడం విశేషం ఆమె నటిస్తున్న అన్ని భాషల్లో కూడా టాప్ గానే ఉండటం చెప్పుకోదగ్గ విషయం.

ఇక నయన్ నిన్న మొన్నటి వరకు సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్( South Indian Lady Superstar ) గానే ఉండేది.అంతేకాదు ఇక్కడ అందరి హీరోలతో పాటు ఆమె కూడా దీటుగా కెరియర్ కొనసాగిస్తుంది.సౌత్ ఇండియా పరిశ్రమలలో అన్ని భాషల్లో నటించిన నయన్ ప్రమోషన్స్ విషయంలో ఎప్పుడూ దూరంగానే ఉంటుంది.సినిమాలో నటించామా ఇంటికి వెళ్లిపోయామా అన్న రీతిలో ఆమె వ్యవహరిస్తూ ఉంటుంది.
ఎన్నో ఎఫైర్స్ కొనసాగించి చివరికి విగ్నేష్ శివన్( Vignesh Sivan ) తో వివాహం జరిగే కవల పిల్లలకు జన్మనిచ్చిన కూడా ఆమె జోరు ఏమాత్రం తగ్గలేదు.

ఇక ప్రస్తుతం ఆమె హిందీలో కూడా అడుగుపెట్టి జవాన్( Jawan ) సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే.ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో నయన్ రేంజ్ కూడా మరో రేంజ్ కి వెళ్ళిపోయింది.నయన్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది.
అందుకే ఆమె పారితోషకం కూడా చుక్కల్లో ఉంటుంది.నిన్న మొన్నటి వరకు ఆరేడు కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకునే నయన్ జవాన్ హిట్ తో జిఎస్టి తో కలిపి పదకొండు కోట్ల రూపాయలను పారితోషకంగా పుచ్చుకుంటుంది.
ఇంత పారితోషకం ఇవ్వాలంటే చిన్న సినిమా హీరోలకు యావరేజ్ హీరోలకు కుదరదు కాబట్టి అందరూ దడుచుకుంటున్నారు.ఇంత పారితోషకం ఇచ్చే కన్నా ఆ డబ్బుతో రెండు మూడు చిన్న సినిమాలు తీయొచ్చు అంటూ సెటైర్స్ వేస్తున్న వారు కూడా ఉన్నారు.







