స్కిన్ టోన్ ను పెంచుకోవాలనే కోరిక ఎందరికో ఉంటుంది.అందుకోసమే మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ క్రీమ్ మాత్రం తప్పకుండా మీ చర్మ ఛాయను పెంచుతుంది.
అదే సమయంలో మరెన్నో చర్మ సంబంధిత సమస్యలను సైతం నివారిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఆరు బాదం పప్పులను తీసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకుని అందులో గ్లాస్ పాలు పోయాలి.
పాలు కాస్త హీట్ అయ్యాక అందులో దంచి పెట్టుకున్న బాదం, చిటికెడు కుంకుమ పువ్వు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని పాలు సగం అయే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.ఇలా మరిగించిన పాలను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని.
అప్పుడు దాని నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల షియా బటర్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో బాగా మిక్స్ చేసుకుంటే న్యాచురల్ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ సిద్ధం అవుతుంది.
ఈ క్రీమ్‌ను ఓ పొడి డబ్బాలో నింపుకుని ఫ్రిడ్జ్‌లో పెడితే పది రోజుల పాటు వాడుకోవచ్చు.

రాత్రుళ్లు నిద్రపోయే ముందు ముఖానికి ఉన్న మేకప్ మొత్తాన్ని పూర్తిగా తొలగించి గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసి పెట్టుకున్న మ్యాజికల్ క్రీమ్ ను ముఖానికి సున్నితంగా అప్లై చేసుకుని పడుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక చర్మ ఛాయ పెరుగుతుంది.
పిగ్మెంటేషన్ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.మరియు త్వరగా ముడతలు సైతం రాకుండా ఉంటాయి.
కాబట్టి, ఈ క్రీమ్‌ను తప్పకుండా ట్రై చేయండి.