పచ్చి మామిడికాయలు తినడం ద్వారా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

చాలామంది పచ్చి మామిడికాయను తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఇక అతి ముఖ్యంగా గర్భవతులు కూడా పచ్చి మామిడికాయ తినడానికి ఎంతో ఆరాటపడిపోతూ ఉంటారు.

 Do You Know The Health Benefits Of Eating Raw Mangoes , Mangoes , Vitamin C ,imm-TeluguStop.com

ఇప్పుడు పచ్చి మామిడికాయల సీజన్ వచ్చేసిందని చెప్పాలి.అక్కడక్కడ మార్కెట్లలో కూడా పచ్చి మామిడికాయలు లభిస్తున్నాయి.

అయితే అవి అద్భుతమైన పుల్లని, వగరు రుచులతో ఉన్నాయి.మామిడితో చాలామంది చట్నీ, పప్పు, కర్రీలు, పచ్చళ్ళు లాంటివి చేసుకుంటారు.

కానీ పచ్చి మామిడి తో అద్భుతమైన రుచితో పాటు ఎన్నో ఔషధ, పోషక గుణాలు ఉన్నాయని ఇది మన సంపూర్ణ ఆరోగ్యానికి రక్షించడంలో సహాయపడతాయని చాలామందికి తెలిసి ఉండదు.ఎందుకంటే పచ్చి మామిడికాయల్లో ఎక్కువగా విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం లాంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా లభిస్తాయి.

అదేవిధంగా ఇది మనలో వ్యాధి నిరోధక శక్తిని కూడా ఇది పెంపొందించడానికి సహాయపడుతుంది.

Telugu Pressure, Carotenoid, Benefits, Tips, Heart Attack, Immunity, Mangoes, Vi

ఇందులో ఉండే విటమిన్ ఏ, కెరోటినాయిడ్స్ కంటి ఇన్ఫెక్షన్లను తగ్గించి కంటి చూపు మెరుగుపడేలా సహాయపడుతుంది.అలాగే ఈ సీజన్లో పచ్చి మామిడికాయలు తినడం వల్ల విటమిన్స్ లోపం తొలగిపోయి కర్కి, చర్మం పొడి వారడం, జుట్టు సమస్యలు, చిగుళ్లలో రక్తం కారడం లాంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి.ఎందుకంటే పచ్చి మామిడికాయలలో సమృద్ధిగా ఫైబర్ ఉంటుంది.

ఇక ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Telugu Pressure, Carotenoid, Benefits, Tips, Heart Attack, Immunity, Mangoes, Vi

అదేవిధంగా ఇది మలబద్ధకం, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలను కూడా తొలగిస్తుంది.ఇక అలా అని మరీ ఎక్కువగా పచ్చి మామిడికాయలను తింటే మాత్రం జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇలా ఎక్కువగా తింటే అజీర్తి, కడుపులో మంట, గొంతులో మంట, విరోచనాలు లాంటి సమస్యలు తలెత్తుతాయి.

ఇందులో మెగ్నీషియం, జింక్ ఎక్కువగా లభిస్తుంది.ఇది రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

అలాగే రక్తపోటు, గుండెపోటు లాంటి ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube