సాధారణంగా మన దేశంలో అన్ని ఆలయాలలోకి భక్తులు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు.భక్తికి ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆ స్వామివారి దర్శనం చేసుకున్నారు.
కానీ కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలు అనుమతి లేదు.అదేవిధంగా వివాహం జరిగిన పురుషులు ఈ గర్భగుడిలోనికి ప్రవేశం లేదు.
ఇంతకీ ఆ దేవాలయం ఏమిటి? ఎక్కడ ఉంది? ఆలయంలోనికి వివాహితులైన
పురుషులు ఎందుకు వెళ్ళకూడదు అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందా.
సాధారణంగా మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు మనకు దర్శనమిస్తాయి.
అయితే వీటిలో మనకు బ్రహ్మ దేవాలయం చాలా అరుదుగా కనిపిస్తాయి.విష్ణుమూర్తి శాపం పెట్టడం వల్ల బ్రహ్మ దేవుడికి ఎవరు పూజలు చేయరు.
అందువల్ల బ్రహ్మ దేవాలయాలు కూడా మనకు కనిపించడం చాలా అరుదు.మనదేశంలోని అరుదైన మూడు బ్రహ్మ దేవాలయలు ఉన్నాయి.
వాటిలో ఒకటి రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ జిల్లా, పుష్కర్ అనే ఊరులో ఉంది.ఇక్కడ పుష్కర నది ఒడ్డున బ్రహ్మ దేవాలయం ఉంది.

పుష్కర నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయంలోనికి వివాహితులైన పురుషులకు ప్రవేశం లేదు అందుకు గల కారణం ఏమిటంటే.పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు పుష్కర నది ఒడ్డున యజ్ఞం చేయాలని భావించారు.అయితే యజ్ఞం చేసేటప్పుడు తప్పకుండా భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాలనే ఆచారం మనకు తెలిసినదే.ఈ నేపథ్యంలోనే యజ్ఞం చేయడానికి తలపెట్టిన బ్రహ్మ, ఆ యజ్ఞంలో పాల్గొనడానికి సరస్వతి దేవి ఎంతో ఆలస్యంగా రావడంతో బ్రహ్మ దేవుడు గాయత్రి దేవిని పేల్లాడి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడు.
ఈ విషయం తెలుసుకున్న సరస్వతీ దేవి ఎంతో ఆగ్రహానికి గురై పెళ్లయిన పురుషులు ఎవరు ఈ ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించిరాదని శాపం పెట్టింది.ఒకవేళ ఆలయంలోనికి ఎవరైనా వివాహం అయినా పురుషులు వస్తే వారి వివాహ దాంపత్యంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తారని, అందుకోసమే ఆలయంలోనికి ప్రవేశించరని పురాణాలు చెబుతున్నాయి.