డైరెక్టర్ జయ శంకర్ గురించి మనందరికి తెలిసిందే.పేపర్ బాయ్ మూవీతో భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు జయ శంకర్.
ఇకపోతే ఇప్పుడు అరి( Ari Movie ) అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.ప్రస్తుతం ఈ సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో టీమ్ బిజీగా ఉంది.
ఇప్పటికే సైకో మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన అరి మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీ లు ఈ మూవీని వీక్షించి ప్రశంసలు కురిపించారు.
భగవద్గీత లోని సారాన్ని అరి చిత్రంలో అద్భుతంగా చూపించారని చెబుతున్నారు.కాగా ఈ సినిమాలో చాలా మంది నటి నటులు నటించి మెప్పించారు.

అరిషడ్వర్గాల మీద తీసిన ఈ చిత్రం ఇప్పటి తరానికి చాలా ముఖ్యమని, సినిమా అద్భుతంగా ఉందని స్పెషల్ షోని( Special Show ) చూసిన వారంతా తెగ పొగిడేస్తున్నారు.ఇకపోతే ఈ అరి మూవీని ప్రస్తుతం చూసేందుకు కొంత మందికి అవకాశాన్ని కల్పిస్తోంది చిత్ర యూనిట్.మైథలాజికల్ థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే ఆడియెన్స్ కు ఈ చిత్రం మరింతగా నచ్చేలా ఉంటుందట.సినీ లవర్స్ కూడా ముందుగానే అరి మూవీని చూసే అవకాశాన్ని చిత్ర యూనిట్ కల్పిస్తోంది.
ఇలా విడుదలకు ముందే సినిమాను చూపించే ధైర్యాన్ని ఎవ్వరూ చేయరు.కానీ అరి మీదున్న నమ్మకం దర్శకుడు జయ శంకర్( Director Jayashanakr ) ఇలా ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

విడుదలకు ముందే సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించాలనుకునే వారు వివరాల్ని తెలియజేయండి అంటూ వాట్సాప్ నంబర్ ను కూడా డైరెక్టర్ జోడించారు.విభిన్నంగా సినిమా తీయడమే కాదు.అంత కంటే విభిన్నంగా సినిమాని ప్రమోట్ చేస్తేనే ఈ రోజుల్లో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించగలరు.
ఇప్పుడు అరి మూవీ టీమ్ కూడా ఇలానే డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.రిలీజ్ కి ముందే సినిమాను చూపిస్తాం అని ఒక పోస్ట్ రిలీజ్ చేసింది.







