మన దేశంలోని చాలామంది ప్రజలు తమ ఇళ్లలో ప్రతిరోజు పూజలు( Pooja ) చేస్తూ ఉంటారు.అయితే నియమానుసారంగా పూజలు చేస్తే పర్వాలేదు కానీ నియమాలను తప్పించి పూజ చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆ తప్పుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.అయితే పూజ చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు.
మరి ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మామూలుగా పూజ గదిలో( Pooja Room ) దేవత విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి.అంతకన్నా పెద్దగా అసలు ఉండకూడదు.మంత్రపుష్పం, సుప్రభాతం కూర్చొని అస్సలు చదవకూడదు.
ఇలా చేస్తే మహా పాపం.శివుడికి లేదా వేరే దేవుడికి ఎవరికైనా కూడా పవళింపు సేవ( Pavalimpu Seva ) నిల్చుని చేయకూడదు.
ఎప్పుడు కూర్చుని మాత్రమే చేయాలి.అలాగే పూజ చేసే సమయంలో నుదుటిపై బొట్టును తప్పనిసరిగా ధరించాలి.
అలా ధరించకుండా పూజ చేయరాదు.అంతేకాకుండా ఒక చేత్తో ఎప్పుడు నమస్కరించకూడదు.
ఇది చాలా తప్పు అనీ పెద్దవారు చెబుతూ ఉంటారు.అలాగే ఈశ్వరుడికి వీపు చూపరాదు.
ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షణ చేయరాదు.ఈశ్వరుడికి చేసే దీపారాధన( Deeparadhana ) పరదేవతతో సమానం కాబట్టి ఆ దీపారాధనలో పుల్లలు కానీ, సామ్రానీ కడ్డీ కానీ, హారతి కర్పూరం కానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు.పూజ సమయంలో ఈశ్వరుడు( Parameshwara ) మనకంటే ఎత్తులో ఉండాలి.అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి.మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్థాలు తినకూడదు.మహిళలు చేయకూడని కొన్ని పొరపాట్లు విషయానికి వస్తే మహిళలు తులసి దళాలు( Tulsi Leaves ) తుంచకూడదు.
పురుషులు మాత్రమే తుంచవలెను.మహిళలు జుట్టు విరపోసుకొని ఎప్పటికీ ఉండకూడదు.
ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL