ప్రస్తుతం తెలంగాణలో బలగం సినిమా( Balagam ) హవా నడుస్తోంది.ఏ పట్టణంలో ఏ పల్లెలో చూసిన కూడా బలగం సినిమా గురించే చర్చ జరుగుతుంది.
ప్రతి పల్లెటూరులో ఏ ఇద్దరు కలిసినా కూడా బలగం సినిమా సన్నివేశాల గురించి మాట్లాడుకుంటున్నారు.అంతగా ప్రజలకు ఈ సినిమా కనెక్ట్ అయింది.
ఎందుకంటే ఈ సినిమాలో బంధాలు, బంధుత్వాలే మన బలగం అని సందేశం ఇచ్చారు దర్శకుడు.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగాలకు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఇక దర్శకుడు అయిన వేణు ( Venu ) చివర్లో తీసుకున్న కాన్సెప్ట్ దశదిన కార్యక్రమం అందరిని ఏడిపించేస్తుంది.అయితే నిజంగా సినిమాలో చూపించినట్లుగా కాకికి పిండం( Crow ) ముట్టుకోకపోతే చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతించవా? దానివల్ల ఊరికి అరిష్టం పడుతుందనే వాదనలో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు గరుడ పురాణం( Garuda Puranam ) ఏం చెబుతుంది? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.పురాణాలు, భాగవత కథలు, చరిత్రకు సంబంధించిన అంశాలు, జానపద కథలను తీసుకొని గతంలో వెండితెరపై సినిమాలుగా రూపొందించేవారు.మారుతున్న కాలంతో పాటు సినిమాల కథలు కూడా మారుతూ వస్తున్నాయి.
మనిషి జీవితంతో ముడిపడి ఉండే చావు దానికి సంబంధించిన ఖర్మకాండాలు, దశదినకర్మతో తెరకెక్కిన సినిమా బలగం.
అయితే ఈ సినిమాలో చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహారం మూడు రోజుల కర్మ రోజు అలాగే ఐదవ రోజు చివరగా 11వ రోజున ఉంచుతారు.గరుడ పురాణంలో ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ ప్రేతాత్మగా మారి పక్షి రూపంలో అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది.ఇక చనిపోయాక మూడవరోజు అలాగే ఐదవ రోజు, 11వ రోజు చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి స్మశాన వాటిక వద్దకు వెళ్లి మొక్కుతారు.
అలా మొక్కితే పక్షి రూపంలో ఉన్న మనిషి వచ్చి వాటిని రుచి చూసి వెళ్తుంది.అలా పక్షి రుచి చూస్తే అంతా ఫలితంగా మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారు.
ఒకవేళ మనం పెట్టిన ఆహార పదార్థాలు పక్షి ముట్టకపోతే ఎక్కడో ఏదో లోపం జరిగిందని, ఇంట్లో ఏదో అరిష్టం జరిగిందని ఎక్కువగా నమ్ముతారు.
DEVOTIONAL