ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.శివరాత్రి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
శివరాత్రి రోజున నిష్టగా ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో ఆ పరమశివుని పూజిస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని వేద పండితులు చెబుతున్నారు.మన ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అయితే ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి.అప్పుడే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది.
ఉపవాసం ఉండేవారు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు కొన్ని రకాల ఆహారాలతోనే ఉపవాస దీక్షను విరమించాల్సి ఉంటుంది.
పండ్లు, పాలతో కూడిన భోజనంతో ఉపవాసాన్ని విరమించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.వీటికి బదులుగా మాంసాహారం, ఆల్కహాల్ లాంటి ఇతర పదార్థాలతో ఉపవాసాన్ని విరమిస్తే శివుడి అనుగ్రహం లభించదని, అంతేకాకుండా మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే శివుడి ఆగ్రహానికి లోనవుతారని చెబుతున్నారు.
సనాతన ధర్మంలో పరిశుభ్రత చాలా కీలకమైన అంశమని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.అందులో శివరాత్రి రోజు శుచి శుభ్రత ను కచ్చితంగా పాటించాలి.అయితే కొంతమంది ఉపవాసం ఉండేవారు ఎప్పుడో ఉపవాసం విడిచే ముందు బ్రష్ స్నానం చేస్తుంటారు.
కానీ ఇలా పరిశుభ్రత లేకుండా అసలు ఉండకూడదు.దీనివల్ల మీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంది.
శివరాత్రి అంటే శివుడికి అంకితం చేయబడిన రోజు అని అ ఖచ్చితంగా అర్థం.ఈ రోజున శివుడికి సంబంధించిన పూజలు, మంత్రాలను మాత్రమే పాటించాలి.
అంతేగాని వేరే మంత్రాలన్నీ అస్సలు పాటించకూడదు.దీని వల్ల మీరు పరమేశ్వరుడి అనుగ్రహాన్ని అస్సలు పొందలేరు.
శివరాత్రి రోజు ఉపవాస దీక్షను ఎప్పుడు విరమించాలో అలాంటి పద్ధతులను పక్కగా పాటించాలి.ఇలా చేయడం వల్ల మీరు శివుని అనుగ్రహాన్ని పొందగలరు.
DEVOTIONAL