నిన్న మొన్నటి వరకూ టాలీవుడ్ లో ఒక వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది.అదే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ సింగర్లుగా కొనసాగుతున్న శ్రావణ భార్గవి హేమచంద్ర విడిపోతున్నారు అని.
దీంతో అందరూ అవాక్కయ్యారు.వీళ్ళకేం వచ్చింది.
మొన్నటిదాకా ఎంతో సంతోషంగా ఉన్నారు.పైగా ప్రేమ పెళ్లి కూడా చేసుకున్నారు.
ఇక ఇప్పుడు ఇలా ఎందుకు విడిపోతున్నారు అంటూ అందరూ చర్చించుకోవడం మొదలు పెట్టారు.విడాకుల వార్త హాట్ టాపిక్ గా మారిపోయినా ఈ నేపథ్యంలో వీరి మధ్య పరిచయం ఎక్కడ పుట్టింది ప్రేమ ఎలా పుట్టింది అన్నది హాట్ టాపిక్గా మారిపోయింది.
ఆ వివరాల్లోకి వెళితే.రైడ్ సినిమా రికార్డింగ్ జరుగుతుండగా హేమచంద్ర ఒక లేడీ సింగర్ కోసం ట్రై చేస్తున్నాడట.ఎవరి ద్వారానో శ్రావణ భార్గవి నెంబర్ దొరికితే చివరికి ఫోన్ చేశాడు.అయితే 2009లో సరిగ్గా ఉగాది రోజున శ్రావణ భార్గవి హేమచంద్ర ఇంటికి వెళ్ళింది.
సాంప్రదాయమైన దుస్తుల్లో వెళ్ళిందో ఏమో మొదటి చూపులోనే హేమచంద్ర శ్రావణ భార్గవి ప్రేమలో పడిపోయాడట.మనసులో అలాగే ప్రేమని దాచుకున్నాడు.
కొన్నాళ్లకు వీరి మధ్య పరిచయం పెరగడంతో ఇద్దరు మనుషులు కలుసుకున్నాయి.హేమచంద్ర తనని ప్రేమిస్తున్నాడని విషయం భార్గవి మనసుకు కూడా అర్థమైంది.
ఇక పరిచయం పెరిగినా హేమచంద్ర ప్రపోజ్ చేసే ధైర్యం చేయలేదట.ఎక్కడ ప్రపోజ్ చేస్తే తనకు భార్గవి దూరం అవుతుందో అని భయపడ్డాడట.అలా ఇద్దరూ కూడా స్టార్ సింగర్ లుగా మారిపోయారు.ఓ రోజు కాలేజీ నుంచి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇక మనసులో మాట బయటపెట్టే సరికి.
శ్రావణ భార్గవి అబ్బా అప్పుడే చెప్పేసావా అంటూ సమాధానం చెప్పడంతో.హేమచంద్ర షాక్ అయ్యాడట.చివరికి పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగిపోయింది.వీరికి ఒక బిడ్డ కూడా పుట్టింది.
ఇకపోతే వీరిద్దరి మధ్య విడాకులకు సంబంధించిన వార్త విషయానికొస్తే.ఇటీవల వీటిపై శ్రావణ భార్గవి హేమచంద్ర స్పందించారు.
మేము ఇద్దరం కలిసి ఉన్నామని.మా గురించి ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకోకండి అంటూ క్లారిటీ ఇచ్చారు.