ఆయిల్ రిఫైనరీలో పెట్రోల్ దొంగతనం .. సింగపూర్‌లో భారతీయుడికి జైలు

ఆయిల్ రిఫైనరీలో దొంగతనం కేసుకు సంబంధించి సింగపూర్ లో భారతీయుడికి నాలుగు వారాల జైలు శిక్ష విధించింది కోర్టు.అంతేకాదు అతను షెల్ ఉద్యోగి నుంచి తీసుకున్న లంచానికి సమానమైన మొత్తాన్ని జరిమానా కింద చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినట్లు మీడియా నివేదిక తెలిపింది.

 Indian Jailed In Petroleum Theft Case At Singapore Refinery Indian, Jailed ,sin-TeluguStop.com

నిందితుడిని 39 ఏళ్ల పరమానందం శ్రీనివాసన్ గా గుర్తించారు.ఇతను షెల్ పులౌ బూకోమ్ రిఫైనరీలో సర్వేయర్ గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో షెల్ లోనే ఉద్యోగిగా వున్న ముజఫర్ అలీ ఖాన్ ముహమ్మద్ అక్రమ్ నుంచి 3000 అమెరికా డాలర్లను లంచంగా తీసుకుని పెట్రోలియం దొంగతనానికి సహకరించినట్లుగా అభియోగాలు మోపారు.కేసు విచారణలో భాగంగా శ్రీనివాసన్ తన నేరాన్ని అంగీకరించాడు.

ఈ నేరానికి గాను అతనికి నాలుగు వారాల జైలు శిక్షతో పాటు 4,060.70 సింగపూర్ డాలర్ల జరిమానాను కోర్టు విధించినట్లు స్థానిక డాలర్, ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక నివేదించింది.ఏప్రిల్ 14న అప్పటి షెల్ ఉద్యోగులు ముజఫర్, జువాండీ పుంగోట్, రిచర్డ్ గో చీ కియోంగ్ ల నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న 12 మంది సర్వేయర్లలో శ్రీనివాసన్ కూడా ఒకరని మీడియా నివేదిక చెబుతోంది.2016 ఏప్రిల్ 28న తన కంపెనీ ఓడను తనిఖీ చేస్తుండగా ముజఫర్ ను పరమానందం గుర్తించాడు.

Telugu America, Gas Oil, Indian, Jailed, Jwandi, Muzaffar, Petroleum Theft, Sing

పరమానందం పనిచేస్తున్న ఎస్జీఎస్ టెస్టింగ్ అండ్ కంట్రోల్ సర్వీసెస్ సింగపూర్.షెల్ వంటి సరఫరాదారులకు చెందిన నౌకల్లో కార్గో పరిమాణాన్ని తనిఖీ చేయడంతో పాటు సర్వేయింగ్ సేవలను అందిస్తుంది.లంచం తీసుకున్న అనంతరం శ్రీనివాసన్.లోడ్ చేయబడిన సరుకు మొత్తాన్ని ఖచ్చితంగా నివేదించలేదు.అలాగే షెల్ పులౌ బుకోమ్ వద్ద గ్యాస్ ఆయిల్ ను ముజఫర్ దొంగతనం చేసిన విషయాన్ని చూసీచూడనట్లుగా వదిలేశాడు.ఈ చర్యల ద్వారా నిందితులైన ముజఫర్, జువాండీ తదితరులకు గ్యాస్ ఆయిల్ దొంగతనంలో శ్రీనివాసన్,సహకరించినట్లు డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు.దీని కారణంగా 2,36,956.14 అమెరికన్ డాలర్ల విలువైన ఆయిల్ దొంగతనానికి గురైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube