ఆయిల్ రిఫైనరీలో పెట్రోల్ దొంగతనం .. సింగపూర్‌లో భారతీయుడికి జైలు

ఆయిల్ రిఫైనరీలో దొంగతనం కేసుకు సంబంధించి సింగపూర్ లో భారతీయుడికి నాలుగు వారాల జైలు శిక్ష విధించింది కోర్టు.

అంతేకాదు అతను షెల్ ఉద్యోగి నుంచి తీసుకున్న లంచానికి సమానమైన మొత్తాన్ని జరిమానా కింద చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినట్లు మీడియా నివేదిక తెలిపింది.

నిందితుడిని 39 ఏళ్ల పరమానందం శ్రీనివాసన్ గా గుర్తించారు.ఇతను షెల్ పులౌ బూకోమ్ రిఫైనరీలో సర్వేయర్ గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో షెల్ లోనే ఉద్యోగిగా వున్న ముజఫర్ అలీ ఖాన్ ముహమ్మద్ అక్రమ్ నుంచి 3000 అమెరికా డాలర్లను లంచంగా తీసుకుని పెట్రోలియం దొంగతనానికి సహకరించినట్లుగా అభియోగాలు మోపారు.

కేసు విచారణలో భాగంగా శ్రీనివాసన్ తన నేరాన్ని అంగీకరించాడు.ఈ నేరానికి గాను అతనికి నాలుగు వారాల జైలు శిక్షతో పాటు 4,060.

70 సింగపూర్ డాలర్ల జరిమానాను కోర్టు విధించినట్లు స్థానిక డాలర్, ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక నివేదించింది.

ఏప్రిల్ 14న అప్పటి షెల్ ఉద్యోగులు ముజఫర్, జువాండీ పుంగోట్, రిచర్డ్ గో చీ కియోంగ్ ల నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న 12 మంది సర్వేయర్లలో శ్రీనివాసన్ కూడా ఒకరని మీడియా నివేదిక చెబుతోంది.

2016 ఏప్రిల్ 28న తన కంపెనీ ఓడను తనిఖీ చేస్తుండగా ముజఫర్ ను పరమానందం గుర్తించాడు.

"""/"/ పరమానందం పనిచేస్తున్న ఎస్జీఎస్ టెస్టింగ్ అండ్ కంట్రోల్ సర్వీసెస్ సింగపూర్.షెల్ వంటి సరఫరాదారులకు చెందిన నౌకల్లో కార్గో పరిమాణాన్ని తనిఖీ చేయడంతో పాటు సర్వేయింగ్ సేవలను అందిస్తుంది.

లంచం తీసుకున్న అనంతరం శ్రీనివాసన్.లోడ్ చేయబడిన సరుకు మొత్తాన్ని ఖచ్చితంగా నివేదించలేదు.

అలాగే షెల్ పులౌ బుకోమ్ వద్ద గ్యాస్ ఆయిల్ ను ముజఫర్ దొంగతనం చేసిన విషయాన్ని చూసీచూడనట్లుగా వదిలేశాడు.

ఈ చర్యల ద్వారా నిందితులైన ముజఫర్, జువాండీ తదితరులకు గ్యాస్ ఆయిల్ దొంగతనంలో శ్రీనివాసన్,సహకరించినట్లు డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు.

దీని కారణంగా 2,36,956.14 అమెరికన్ డాలర్ల విలువైన ఆయిల్ దొంగతనానికి గురైంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్19, గురువారం 2024