కొబ్బరి పాలు, అవిసె గింజలతో ఇలా చేశారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు!

ఆడ మగ అనే తేడా లేదు ప్రస్తుత రోజుల్లో కోట్లాది మంది హెయిర్ ఫాల్( Hair fall ) సమస్యను ఎదుర్కొంటున్నారు.అయితే అందరిలోనూ జుట్టు రాలడానికి ఒకే రకమైన కారణాలు ఉండవు.

 Doing This With Coconut Milk And Flax Seeds Will Reduce Hair Fall! Hair Fall, St-TeluguStop.com

అలాగే అందరిలోనూ ఒకే విధంగా హెయిర్ ఫాల్ ఉండదు.కొందరిలో జుట్టు రాలడం అనేది తక్కువగా ఉంటే.

కొందరిలో చాలా ఎక్కువగా ఉంటుంది.ఏ విధంగా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే సత్తా ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ కి ఉంది.

ఈ‌ రెమెడీని ఫాలో అయ్యారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.

Telugu Coconut Milk, Coconutmilk, Flax Seeds, Care, Care Tips, Pack, Healthy, La

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న అవిసె గింజలను వేసుకోవాలి.అలాగే ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలు( Coconut milk ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Coconut Milk, Coconutmilk, Flax Seeds, Care, Care Tips, Pack, Healthy, La

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలిక పాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.

ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.జుట్టు ఒత్తుగా మారుతుంది.

అలాగే అవిసె గింజలు, కొబ్బరి పాలు పొడి జుట్టును రిపేర్ చేస్తాయి.కురులను సిల్కీగా షైనీ గా మెరిపిస్తాయి.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, ఆరోగ్యకరమైన స్కాల్ప్‌ కు దోహదపడటంలో, మూలాల నుంచి జుట్టును బలోపేతం చేయడంలో కూడా ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube