ఇటీవల రోజుల్లో కాలుష్యం, హార్మోన్ల ప్రభావం, పోషకాల కొరత, రసాయనాలు అధికంగా ఉండే కేశ ఉత్పత్తులను వాడటం, ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు( White Hair ) సమస్యలు ఎదుర్కొంటున్నారు.తలలో తెల్ల వెంట్రుకలు కనపడగానే ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది.
వాటిని కవర్ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడతారు.అయితే ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చే పవర్ ఫుల్ ఆయిల్ ఒకటి ఉంది.
ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు మెంతులు,( Fenugreek Seeds ) మూడు రెబ్బలు కరివేపాకు( Curry Leaves ) వేసి పూర్తిగా నల్లగా మారేంతవరకు వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న మెంతులు కరివేపాకును మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ లో అర కప్పు ఆవనూనె( Mustard Oil ) మరియు గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, కరివేపాకు పొడి వేసి బాగా మిక్స్ చేసి ఎండలో మూడు రోజులపాటు ఉంచాలి.
దాంతో మన ఆయిల్ అనేది రెడీ అవుతుంది.

ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న రెండు గంటల తర్వాత తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడారంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
జుట్టులో మెలనిన్ ఉత్పత్తి పెరిగి వైట్ హెయిర్ ప్రాబ్లం కు అడ్డుకట్ట పడుతుంది.అలాగే ఈ ఆయిల్ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.జుట్టు రాలడాన్ని తగ్గించి దట్టంగా పెరిగేలా చేస్తుంది.కాబట్టి వైట్ హెయిర్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఆయిల్ ను ప్రిపేర్ చేసుకొని వాడేందుకు ప్రయత్నించండి.