దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో నీరసంగా ఫీల్ అయ్యే ఉంటారు.నీరసం అనేది చిన్న సమస్యే అయినప్పటికీ దాని వల్ల చాలా సౌకర్యానికి గురవుతుంటారు.
ఏ పని చేయలేకపోతుంటారు.శ్రమకు మించిన పనులు చేయడం, అధిక వ్యాయామం, వేళకు ఆహారం తీసుకోపోవడం, పోషకాల కొరత, రక్తహీనత తదితర కారణాల వల్ల నీరసం తలెత్తుతుంది.
అయితే నీరసం విపరీతంగా వేధిస్తున్న సమయంలో ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను కనుక తీసుకున్నారంటే ఒక్క దెబ్బతో నీరసం ఎగిరిపోతుంది.
నీరసాన్ని వదిలించి శరీరాన్ని క్షణాల్లో ఎనర్జిటిక్ గా మార్చడానికి ఈ జ్యూస్( Juice ) చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎనిమిది బాదం పప్పులు( Almonds ) , ఎనిమిది పిస్తా పప్పులు, ఎనిమిది ఎండు ద్రాక్ష, ఐదు జీడిపప్పులు వేసి వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.
ఆపై ఒక చిన్న కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు ( Pistachios, cashews )మరియు ఎండు ద్రాక్షను వాటర్ లేకుండా వేసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఆపై అందులో అర గ్లాసు కొబ్బరినీళ్లు( Coconut water ) , అర గ్లాస్ కొబ్బరిపాలు మరియు అరకప్పు లేత కొబ్బరి వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.తద్వారా మన జ్యూస్ అనేది సిద్ధం అవుతుంది.
నట్స్ మరియు కొబ్బరి కలయికలో తయారు చేయబడిన ఈ జ్యూస్ ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తుంది.ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది.

నీరసం, అలసట వంటివి వేధిస్తున్న సమయంలో ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ ను తీసుకున్నారంటే మీ శరీరం ఫుల్ ఎనర్జిటిక్ గా మారుతుంది.ఎలాంటి నీరసమైన పరారవుతుంది.అలాగే ఈ జ్యూస్ శరీరంలో అధిక వేడిని తొలగిస్తుంది.బాడీని కూల్ గా మారుస్తుంది.ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలకు చెక్ పెడుతుంది.వేసవికాలంలో రోజు ఈ జ్యూస్ ను కనుక తీసుకున్నారంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు.
వేసవి వేడిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.మరియు వడదెబ్బ మంచి సైతం రక్షణ లభిస్తుంది.