అధిక ఒత్తిడి, డిప్రెషన్, ఆహారపు అలవాట్లు, కంటి నిండా నిద్ర లేకపోవడం, ధూమపానం, మద్యపానం, పోషకాహార లోపం వంటి రకరకాల కారణాల వల్ల చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.ఈ వలయాలు చూసేందుకు అసహ్యంగా కనిపించడమే కాదు అందాన్ని తక్కువ చేసి కూడా చూపిస్తాయి.
అందుకే కళ్ల కింద ఏర్పడ్డ నల్లటి వలయాలను వదిలించుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ హోం మేడ్ క్రీమ్‌ను వాడితే సహజంగానే కళ్ల కింద నల్లటి వలయాలు మాయం అవుతాయి.
మరి ఇంతకీ ఆ మ్యాజికల్ క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, వన్ టేబుల్ స్పూన్ శెనగపప్పు, వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకుని వాటర్‌తో ఒకటి లేదా రెండు సార్లు వాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత రెండు కప్పుల వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్‌లో నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, శెనగపప్పు, పెసరపప్పును వాటర్‌తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నీరు తొలగించిన పెరుగు రెండు టేబుల్ స్పూన్లు, తయారు చేసి పెట్టుకున్న పప్పు దినుసుల జ్యూస్ మూడు టేబుల్ స్పూన్లు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, ఆఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధమైనట్లే.