అల్సర్ ని తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు

ఈ రోజుల్లో మారిన జీవనశైలి, ఆహార నియమాలు పాటించకపోవడం,ఎక్కువగా మసాలా ఉన్న ఆహారాలు తినటం మరియు ఒత్తిడి, ఆందోళన, పెయిన్‌ కిల్లర్స్‌, యాంటీ బయోటిక్‌ మందులను ఎక్కువగా వాడటం వంటి కారణాలతో అల్సర్స్ వస్తున్నాయి.అల్సర్ వచ్చినప్పుడు ఛాతిలో మంట‌, నొప్పి, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, వికారం వంటి స‌మ‌స్య‌లు ఉత్పన్నం అవుతాయి.

 Best-natural-and-homeremedies-for-ulcer , Ulcer , Health Care , Health Tips , V-TeluguStop.com

సాధారణంగా అల్సర్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్లి మందులుతీసుకోని వేసుకోవటం సహజమే.అయితే ఆలా చేయటం చాలా తప్పు.

అల్సర్ రాగానేడాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు వాడుతూ ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే తొందరగా అల్సర్ తగ్గిపోతుంది.ఇప్పుడు అల్సర్ ని తగ్గించే ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం.

రాత్రి పడుకొనే ముందు క్యాబేజి రసాన్ని త్రాగితే అల్సర్ కి చాలా బాగా పనిచేస్తుంది.క్యాబేజిలో ఉండే లక్షాణాలు అల్సర్ ని నివారించడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.

ప్రతి రోజు ఆహారం తీసుకొనే ముందు ఒక స్పూన్ తేనెను తీసుకోవాలి.తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అల్సర్ ని నివారిస్తాయి.

అల్సర్ కి అరటిపండు మంచి ఔషధంగా చెప్పవచ్చు.అరటిపండు కడుపులో పుండ్లు పెరగకుండా చేయటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

విటమిన్ E సమృద్ధిగా ఉండే చేపలు,బాదాం పప్పు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్న కొబ్బరినూనె అల్సర్ మీద పోరాటం చేస్తుంది.అందువల్ల వంటలలో కొబ్బరినూనె వాడటం చాలా మంచిది.డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతూ ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే అల్సర్ నుండి బయట పడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube