నెల రోజులు ఈ హోమ్ మేడ్ సీరం ను వాడితే మీ జుట్టు మూడింతలు అవ్వడం ఖాయం!

సాధారణంగా కొందరి జుట్టు చాలా పల్చగా ఉంటుంది.ఆడవారిలోనే కాదు మగవారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంటుంది.

 Using This Home Made Serum Will Make Your Hair Thicker! Homemade Serum, Hair Ser-TeluguStop.com

పల్చటి జుట్టు వల్ల ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోలేరు.ఒకవేళ వేసుకున్నా కూడా సెట్ అవ్వవు.

ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు తెగ తాపత్రయ పడుతూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం మీకు చాలా బాగా సహాయపడుతుంది.నెల రోజుల పాటు ఈ సీరంను కనుక వాడితే మీ జుట్టు మూడింతలు అవ్వడం ఖాయం.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ గ్రోత్ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Care, Care Tips, Serum, Healthy, Homemade Serum, Latest, Thick, Thin-Telu

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ) వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు రెబ్బలు కరివేపాకు( Curry leaves ), రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు మరియు అరకప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ లో మెంతులు నానబెట్టుకున్న నీటిని వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ సీరం అనేది సిద్ధం అవుతుంది.

Telugu Care, Care Tips, Serum, Healthy, Homemade Serum, Latest, Thick, Thin-Telu

ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంట తర్వాత మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ సీరంను కనుక వాడితే హెయిర్ గ్రోత్ అనేది అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఎంత పల్చగా ఉన్నా కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.

పల్చటి జుట్టు తో బాధపడుతున్న వారికి ఈ సీరం చాలా బాగా సహాయపడుతుంది.పైగా ఈ సీరం జుట్టు రాలడాన్ని సైతం అరికడుతుంది.

కాబట్టి పల్చటి జుట్టుతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సీరంను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube