వేసవిలో వ్యాయామం చేయడం అంటే గగనమే.అసలే ఎండల వల్ల శరీరంలో నీరు మొత్తం ఆవిరి అయిపోతుంటుంది.
నీరసం, అలసట వంటివి అధికంగా ఇబ్బంది పెడుతుంటాయి.ఇక వ్యాయామం చేస్తే శరీరం మరింత తీవ్రంగా అలసిపోతుంటుంది.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ ను తీసుకుంటే క్షణాల్లో ఎనర్జిటిక్ గా మారతారు.నీరసం, అలసట వంటివి పరార్ అవుతాయి.
మరి ఇంకెందుకు లేటు వేసవిలో వ్యాయామం తర్వాత ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.
కొబ్బరి నీళ్లు( Coconut Water ).రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా ప్రస్తుత వేసవికాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి కొబ్బరి నీళ్లు ఉత్తమంగా సహాయపడతాయి.
వ్యాయామాల అనంతరం ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే తక్షణ శక్తి లభిస్తుంది.అలాగే వీటిలోని ఎలక్ట్రోలైట్స్ డీహైడ్రేషన్ బారిన పడకుండా సాయపడతాయి.
అలాగే బ్లెండర్ తీసుకుని అందులో అరకప్పు యాపిల్ ముక్కలు, అర కప్పు కీర దోసకాయ ముక్కలు( Cucumber ), అర కప్పు కివీ పండు ముక్కలు, ఐదు ఫ్రెష్ పుదీన ఆకులు, ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో రుచికి సరిపడా తేనె ( Honey )కలిపి సేవించాలి.ఈ యాపిల్ కీరా కివీ జ్యూస్ ను ప్రస్తుతం వేసవికాలంలో వ్యాయామం తర్వాత తీసుకుంటే క్షణాల్లో ఎనర్జిటిక్ గా మారతారు.నీరసం అలసటను ఈ జ్యూస్ దూరం చేస్తుంది.
మరియు బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
ఇక వేసవిలో వ్యాయామం తర్వాత వెంటనే శక్తివంతంగా మారడానికి బనానా స్మూతీని కూడా తీసుకోవచ్చు.అందుకోసం బ్లెండర్ లో రెండు టేబుల్ స్పూన్లు అరగంట పాటు వాటర్ లో నానబెట్టుకున్న ఓట్స్ ను వేసుకోవాలి.అలాగే ఒక బనానా, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, మూడు వాల్ నట్స్, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ స్మూతీని తీసుకుంటే వ్యాయామం ద్వారా పోయిన శక్తి మొత్తం క్షణాల్లో తిరిగి వస్తుంది.ఈ స్మూతీ అతి ఆకలి ను దూరం చేస్తుంది.త్వరగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.