రష్మిక మందన.( Rashmika Mandanna ) ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ తో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.
అందుకు గల కారణం ఆమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా సక్సెస్ కావడం.ఇటీవల కాలంలో రష్మిక మందన నటిస్తున్న సినిమాలన్నీ వరుసగా సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే.
ఇలా వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకోవడంతో పాటు ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన.ఇకపోతే రష్మిక నటించిన పుష్ప 2( Pushpa 2 ) మూవీ గత ఏడాది విడుదల అయ్యి దాదాపుగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత విడుదల అయినా చావా( Chhaava ) సినిమా 800 కోట్లకు కలెక్షన్స్ ను సాధించింది.అంటే ఏడాదిలోపే, 2600 కోట్ల వసూళ్లు.

ఇప్పుడు ఈద్ కు మరో బాలీవుడ్ ఫిలిం సికిందర్ సినిమా( Sikandar ) రిలీజ్ అవుతోంది.ఎంత లేదనుకున్నా ఈద్ సమయంలో సల్మాన్ సినిమా అంటే ఈజీగా మూడు నాలుగు వందల కోట్లు కొల్లగొడుతుంది.కేవలం నాలుగు నెలల వ్యవధిలో మూడు వేల కోట్ల వసూళ్లకు రష్మిక కేరాఫ్ అడ్రస్ గా మారనుంది అనేది సంచలనం సృష్టిస్తోంది.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీని ఏళ్లకు ఏళ్లు ఏలిన దీపిక, ఆలియా భట్, కత్రినా కైఫ్ కు కూడా ఇలాంటి రికార్డ్ లేదు.
భవిష్యత్తులో వారు అందుకునే ఛాన్స్ కూడా లేదట.వీటికి అంతకు ముందు రష్మిక నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ యానిమల్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే హిందీ ఇండస్ట్రీలో రష్మిక కలెక్షన్స్ రికార్డ్ రూ.3500 కోట్లు దాటుతుంది.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరే హీరోయిన్ కు ఈ స్థాయి బ్లాక్ బస్టర్స్ లేవని చెప్పాలి.అలాగే ఈ రేంజ్ కలెక్షన్స్ కూడా లేవు.అందుకే రష్మిక నేమ్ అంత స్పెషల్ గా మారింది.
బాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ క్వీన్ అనిపించుకుంటోంది.కాగా కెరీర్ బిగినింగ్ నుంచి రష్మికకు లక్ ఫ్యాక్టర్ ఎక్కువ.
పైగా కష్టపడం ఈ హీరోయిన్‌కు మరింత ఇష్టం.అందుకే ఇంత అందలం.
ఆకాశమే హద్దుగా స్టార్ డమ్.ఒక్క బ్లాక్ బస్టర్ అందివస్తేనే కెరీర్ పరుగులు పెడుతోంది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మా హీరోయిన్ రష్మిక తో అలా ఉంటుంది మరి.అడుగుపెడితే బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ కామెంట్లు చేస్తున్నారు.