బెట్టింగ్ యాప్స్.. ఏడాదికి రూ.10 లక్షలిస్తామన్నారు.. వాసంతి షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్ ల( Betting Apps ) వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విషయం గత కొద్ది రోజులుగా సంచలనంగా మారింది.

 Bigg Boss Contestant Vasanthi Krishnan About Betting Apps Details, Vasanthi Kris-TeluguStop.com

సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ భారీగా డబ్బులను సంపాదించిన ఒక్కొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు పలు సోషల్ మీడియా స్టార్స్ పై కూడా కేసులో నమోదు చేసిన విషయం తెలిసిందే.

దీంతో కొంతమంది తప్పును ఒప్పుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలను కూడా విడుదల చేశారు.

Telugu Vasanthi, Apps, Bigg Boss, Tollywood-Movie

అయినా కూడా పోలీసులు ఒప్పుకోవడం లేదు.తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అంటున్నారు.అయితే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసిన జాబితాలో బుల్లితెర సెలబ్రిటీలు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లే ఎక్కువగా ఉన్నారు.

అందులో వాసంతి కృష్ణన్‌( Vasanthi Krishnan ) కూడా ఉంది.తాజాగా ఆమె బెట్టింగ్‌ యాప్స్‌ గురించి మాట్లాడింది.తాజాగా బిగ్ బాస్( Bigg Boss ) బ్యూటీ వాసంతి మాట్లాడుతూ.బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయమని ఆఫర్లు వస్తుంటే చేసుకుంటూ పోయాను తప్ప దీనివల్ల జనాలు ఇబ్బందిపడుతున్నారని తెలీదు.

ఆ యాప్స్‌ గురించి నాకంత అవగాహన లేదు.

Telugu Vasanthi, Apps, Bigg Boss, Tollywood-Movie

పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చాలామంది ప్రమోషన్స్‌ చేస్తున్నారు కాబట్టి ఇందులో తప్పే లేదని అనుకున్నాను.కనీస అవగాహన లేకుండానే సోషల్‌ మీడియాలో ప్రమోట్‌ చేశాను.అయితే ఇలాంటివి ఎందుకు చేస్తున్నావ్‌ అంటూ నాకు నెగెటివ్‌ కామెంట్లు రావడం మొదలైంది.

ఫాలోవర్లు కూడా తగ్గిపోయారు.నా వల్ల జనాలకు చెడు జరుగుతుందేమోనని ప్రమోషన్స్‌ ఆపేశాను.

ఇప్పటికీ నన్ను ప్రమోషన్స్‌ చేయమని అడుగుతూనే ఉన్నారు.ఏడాదికి ఇంత, రెండేళ్లకు అంత అని ప్యాకేజీలు ఇస్తామని అన్నారు.

అదంతా నావల్ల కాదు అని ఒక వీడియో చేసి ఆపేశాను.అప్పట్లో ఏడాదికి రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ప్యాకేజీ ఇచ్చేవాళ్లు.మీరు సోషల్‌ మీడియాలో ఎలాంటి వీడియో అప్‌లోడ్‌ చేయనవసరం లేదు.కేవలం వీడియో తీసి సెండ్‌ చేయమనేవాళ్లు.కానీ నా అభిమానులు డబ్బు కోల్పోతున్నారని తెలిసి బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయడం ఆపేశాను.అందరూ పాడైపోవాలన్న దురుద్దేశంతో అయితే ప్రమోషన్స్‌ చేయలేదు అని వాసంతి వివరణ ఇచ్చింది.

ఈ సందర్భంగా వాసంతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube