ఆరోగ్యానికి పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు.సీజనల్ గా దొరికే పండ్లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
పండ్ల ద్వారా ఎన్నో అమోఘమైన పోషకాలను తమ సొంత చేసుకోవచ్చు.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు కూడా ఫ్రూట్స్ ఎంతో బాగా సహాయపడతాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఫ్రూట్ మాస్క్ ను వారానికి ఒక్కసారి వేసుకుంటే మీ జుట్టు రాలమన్నా రాలదు.పైగా ఎన్నో హెయిర్ కేర్ బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫ్రూట్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక అవకాడోను తీసుకుని సగానికి కట్ చేసి లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో అవకడో పల్ప్ ను వేసుకోవాలి.అలాగే ఒక కప్పు బొప్పాయి ముక్కలు, అర కప్పు ఫ్రెష్ కొబ్బరిపాలు మరియు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకే ఒక్కసారి ఈ ఫ్రూట్ మాస్క్ ను వేసుకోవడం వల్ల బొప్పాయి అవకాడో మరియు కొబ్బరి పాలలో ఉండే పలు పోషకాలు జుట్టు కుదుళకలను దృఢంగా మారుస్తాయి.

హెయిర్ ఫాల్ సమస్యను కంట్రోల్ చేస్తాయి.అలాగే ఈ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టు చిట్లడం, విరగడం వంటివి తగ్గుతాయి.డ్రై హెయిర్ సమస్య వేధించకుండా ఉంటుంది.
కురులు స్మూత్ అండ్ సిల్కీగా సైతం మారతాయి.కాబట్టి తప్పకుండా వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్ ను వేసుకునేందుకు ప్రయత్నించండి.
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోండి.