ఢిల్లీకి( Delhi ) చెందిన ఓ వ్యక్తి కన్నాట్ ప్లేస్‌లో ఆస్ట్రేలియన్( Australian ) జంటతో చాలా వింతైన, ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు.వారి అనుభవాన్ని రెడ్డిట్‌లో షేర్ చేస్తూ, పర్యాటకులు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3కి వెళ్లే దారి కోసం తనను ఎలా అడిగారో వివరించాడు.
అతను వారికి దారి చూపిస్తుండగా, ఊహించని సంఘటన జరిగింది.ఆ జంటలోని వ్యక్తి అతని “మంచి వాసన” గురించి పొగడ్తలతో ముంచెత్తాడు.
అయితే, పొగడ్తగా మొదలైన సంభాషణ కాస్తా అసౌకర్యంగా మారింది.భారతీయులు ఎవరూ అంత మంచి వాసన వెదజల్లరని, భారతీయులకు ఒళ్లంతా దుర్వాసన వస్తుందని ఆన్‌లైన్‌లో వచ్చే రాతలు నిజమేనని వారు మాట్లాడటం మొదలుపెట్టారు.దీంతో ఆ ఢిల్లీ వ్యక్తి ఎలా స్పందించాలో తెలియక అయోమయంలో పడ్డాడు.
‘సౌత్ ఢిల్లీ-స్నోబ్’( South Delhi-Snob ) అనే యూజర్ నేమ్‌తో రెడిట్‌లో పోస్ట్ చేసిన ఆ వ్యక్తి జరిగిన విషయాన్ని వివరంగా రాసుకొచ్చాడు.“నేను కన్నాట్ ప్లేస్‌లో ఉన్నప్పుడు, ఆస్ట్రేలియన్ జంటను కలిశాను.వారు IGI ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3కి వెళ్లే దారి కోసం అడుగుతున్నారు.
ఢిల్లీ స్టేషన్ నుంచి ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో తీసుకోవాలని వారికి చెప్పి సహాయం చేశాను.మేం స్టేషన్‌లో ఉండగా, ఆ వ్యక్తి హఠాత్తుగా నేను చాలా మంచి వాసన వస్తున్నానని, వారు కలిసిన ఇతర భారతీయుల్లా కాకుండా చాలా భిన్నంగా ఉన్నానని అన్నాడు.
అంతేకాదు, భారతీయులంతా దుర్వాసన వెదజల్లుతారని ఇంటర్నెట్‌లో రాసేది నిజమేనని, అతని భార్య కూడా అతనితో ఏకీభవించింది” అని రాసుకొచ్చాడు.

ఆ ఢిల్లీ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.వారి పొగడ్తకు సంతోషించాలో లేక తోటి భారతీయులను అవమానించినందుకు వారిని నిలదీయాలో అర్థం కాలేదు.చివరికి అతను ఏమీ మాట్లాడలేదు.
మళ్ళీ ఒకసారి వారికి దారిని వివరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.అతను ఆ పరిస్థితిని “చాలా వింతగా” అభివర్ణించాడు.
ఎందుకంటే వారు ఒకవైపు తనను పొగుడుతూనే, మరోవైపు ఒక జాతి మొత్తాన్ని అవమానించారని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.అతని పోస్ట్ రెడ్డిట్‌లో క్షణాల్లో వైరల్ అయింది.
చాలా మంది యూజర్లు ఆ పర్యాటకులు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ కామెంట్లు పెట్టారు.ఒక యూజర్ “ఇది పొగడ్త కాదు.
ఇది జాత్యాహంకారం” అని ఘాటుగా స్పందించాడు.మరొకరు “వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఇలాంటి దురుసు వ్యాఖ్యలు ఎలా చేస్తారు?” అని ప్రశ్నించారు.

కొంతమంది యూజర్లు ఈ పరిస్థితిని చూసి నవ్వుకున్నారు.ఇంకొందరు ఆ ఢిల్లీ వ్యక్తి గట్టిగా మాట్లాడాల్సింది అని అభిప్రాయపడ్డారు.“మీరు వెంటనే అది ఎంత అవమానకరమో వారికి చెప్పి ఉండాల్సింది.అలాంటి వాళ్లను సరిదిద్దాలి” అని ఒక యూజర్ సూచించాడు.
ఈ పోస్ట్ మూస పద్ధతులు, సాంస్కృతిక సున్నితత్వంపై చర్చను రేకెత్తించింది.చాలా మంది ఈ సంఘటన వింతగా ఉన్నా, కొంతమంది ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఎలా పక్షపాత ధోరణులను కలిగి ఉంటారో ఇది ప్రతిబింబిస్తుందని అభిప్రాయపడ్డారు.
మొత్తానికి ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.