పైసా ఖర్చు లేకుండా ఇలా చేస్తే వైట్ అండ్ బ్రైట్ స్కిన్ మీ సొంతం!

ముఖ చర్మం వైట్ గా మరియు బ్రైట్ గా మెరిసిపోతూ కనిపించాలని దాదాపు అందరూ ఆశ పడుతుంటారు.ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో అస్సలు రాజీ పడరు.

 Follow This Home Remedy For White And Bright Skin! White Skin, Bright Skin, Home-TeluguStop.com

మెరిసే చర్మం కోసం ప్రతినెలా బ్యూటీ పార్లర్ లో వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని(Home remedy) కనుక పాటించారంటే వైట్ అండ్ బ్రైట్ స్కిన్ ను సహజంగానే పొందవచ్చు.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ (Coffee powder)వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ పటిక పొడి(Alum powder), వన్ టేబుల్ స్పూన్ తేనె (Honey)మరియు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్‌ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

Telugu Alum Powder, Tips, Skin, Coffee Powder, Face Pack, Remedy, Latest, Skin C

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటించారంటే అద్భుతం ఫలితాలు పొందుతారు.పటికలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలు మరియు మచ్చలను నివారిస్తుంది.ప‌టిక చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.రంధ్రాల రూపాన్ని తగ్గిస్తుంది.చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.అలాగే కాఫీ పౌడర్ చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.

స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేస్తుంది.చర్మానికి కొత్త మెరుపును జోడిస్తుంది.

Telugu Alum Powder, Tips, Skin, Coffee Powder, Face Pack, Remedy, Latest, Skin C

కాఫీలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మీ చర్మాన్ని సూక్ష్మక్రిముల నుండి కాపాడ‌తాయి.ఇక‌ తేనె చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది.చర్మాన్ని మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది.తేనెలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి.ఇవి అకాల చర్మం వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి.చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా ఉంచుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube