ఈ మధ్య కాలంలో దిల్ రాజు( Dil Raju ) అతి చేస్తన్నాడు అనేది అందరు అంటున్న మాట.బలగం సినిమా( Balagam ) సక్సెస్ ఊపులో ఉన్న దిల్ రాజు కు మూడేళ్ళ నుంచి పెండింగ్ లో ఉన్న శాకుంతలం సినిమా గుర్తుకు వచ్చింది.
వీలైనంత పిసినారితనం చూపించి సినిమాలో చవకబారు గ్రాఫిక్స్ తో రిలీజ్ చేస్తే ఎవరు చూస్తారు చెప్పండి.
పైగా హనుమాన్( Hanuman ) వంటి చిన్న హీరో సినిమా అయినా కూడా తక్కువ బడ్జెట్ లో భారీ గ్రాఫిక్స్ తో రిచ్ గా ప్లాన్ చేస్తున్నారు.అసలు శాకుంతలం సినిమా( Sakunthalam movie)కు గుణశేకర్ నిర్మాత.కానీ మధ్యలో బడ్జెట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి దిల్ రాజు దూరిపోయాడు.
కానీ నిండా దూరిపోయాక కానీ సినిమా ఎంత గొప్పగా తీశారో అర్ధం కాలేదు.
అందుకే ప్రమోషన్ ఖర్చు కూడా దండగ అని ఫీల్ అయ్యాడేమో ఎలాంటి హడావిడి లేకుండా సినిమా విడుదల చేసేసారు.పైగా బలగం సినిమాకు చేసినట్టుగా ఏవో కొన్ని ప్రీమియర్ షోలు వేసిన బలగం చిత్రం బాగుంది కాబట్టి మొహమాటపు రివ్యూ ల అయినా రాసారు.దీనికి ఆ టైం కూడా బొక్క అనుకున్నారో ఏంటో తెలియదు కానీ ఒక్కడు కూడా తాము ఈ చిత్రాన్ని ప్రీమియర్ షో చూసాం చాలా బాగుంది అని చెప్పిన రివ్యూ కనిపించలేదు.
పైగా ఈ సినిమా కోసం సమంత ఏదైనా ప్రమోషన్ గట్టిగా చేసి గట్టెక్కిస్తుందా అంటే అది లేదు.ఆమె రోగిష్టి లాగ తయారయ్యి కెమెరా ముందుకు రావడానికి సిద్ధంగా లేదు.
నటన అంటే తెలియని ఒక విలన్, పాత చింతకాయ పచ్చడి లాంటి దర్శకుడు వెరసి సమంతకు ఒక మంచి ప్లాప్ పడింది.
ఇవన్నీ మొదటి రోజు మౌత్ టాక్ పై గట్టిగానే ప్రభావం చూపడం తో దిల్ రాజు మళ్లి తన అతి కి పని చెప్పాడు.సే నో తో పైరసీ అంటూ ఒక నినాదం ఇస్తున్నాడు.ఫ్రీగా చూపిస్తూ మందు పోసి బిర్యానీ పెట్టిన కూడా ఈ చిత్రాన్ని ఎవరు చూడటానికి సిద్ధంగా లేడు.
పైగా పైరసీ ఎవడు చూస్తాడు అన్నట్టుగా సోషల్ మీడియాలో దిల్ రాజు పై సెటైర్స్ కనిపిస్తున్నాయి.పైగా ఇదొక విజువల్ వండర్ అంటూ చెప్పుకోవడం కొసమెరుపు.మరి ఇలాగే దిల్ రాజు అతి చేస్తూ పోతే మాత్రం సోషల్ మీడియా ట్రోల్లర్స్ వదలరు కాక వదలరు.