ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతుంది.రాబోయేది చలి కాలం.
ఈ రెండు సీజన్స్‌లోనూ అంటు వ్యాధులు అత్యధికంగా వ్యాపిస్తుంటాయి.వాటి నుంచి రక్షణ పొందాలంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ను స్ట్రాంగ్ గా ఉంచుకోవడం ఎంతో అవసరం.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే సూపర్ జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ జ్యూస్ ను డైట్ లో గనుక చేర్చుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవ్వడమే కాదు మరెన్నో ఆరోగ్య లాభాలను సైతం పొందవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.ఆపై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక పీచ్ ఫ్రూట్‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇక చివరిగా రెండు ఆరెంజ్ పండ్లను తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పీచ్ ఫ్రూట్ ముక్కలు, ఆరెంజ్ జ్యూస్ మరియు రెండు అల్లం స్లైసెస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్ సిద్ధం అయినట్టే.ఈ జ్యూస్ ను రోజులో ఏదో ఒక సమయంలో తీసుకోవాలి.ప్రతి రోజు ఈ జ్యూస్ ను గనుక తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది.
అంతేకాదు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మూత్ర పిండాలు శుభ్రంగా మారతాయి.
రక్తహీనత సమస్య దూరం అవుతుంది.బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.
రక్తపోటు అదుపులో ఉంటుంది.మరియు చర్మం సూపర్ గ్లోయింగ్‌గా సైతం మెరుస్తుంది.