సోషల్ మీడియా వేగం రోజురోజుకీ పెరిగిపోతోంది.ఇపుడు జనాలకి ఎంటర్టైన్మెంట్ చేతిలోకి వచ్చేసింది స్మార్ట్ ఫోన్ రూపంలో.
ఒకప్పుడు టీవీలు తప్ప ప్రత్యామ్నాయం ఉండేది కాదు.అలాంటిది ఇపుడు మనిషి తాను ఎక్కడికి వెళ్లినా ఎంటర్టైన్మెంట్ తన వెంటే నడిచి వస్తోంది సోషల్ మీడియా రూపంలో.
అవును, ప్రతిరోజూ కొన్ని లక్షల వీడియోలు సోషల్ మీడియా వేదికగా అప్లోడ్ అవుతూ ఉంటాయి.అందులో ఏ కొద్దో వైరల్ అవుతూ ఉంటాయి.
కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చరంగా, ఇంకొన్ని బాధాకరంగా ఉంటాయి.ఇక తాజాగా వైరల్ అవుతున్నది మాత్రం కాస్త ఫన్నీగా వుంది.
ఒకప్పుడు అడవులకు మాత్రమే పరిమితమైన వానరాలు ఆహారం దొరకక ఇపుడు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి.ఇళ్లు, ఆలయాలు అని తేడా లేకుండా చొరబడుతూ వస్తువులను ఎత్తుకెళ్లడం, అడ్డొచ్చిన వారిపై దాడికి దిగడం వంటివి చేస్తున్నాయి.
ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఇంటి వద్దకు వచ్చిన కోతిని తరిమేందుకు ఆ ఇంటి యజమాని ప్రయత్నిస్తాడు.దాని మీదకు రాయి విసిరేందుకు కిందకు వంగి రాయిని తీయబోయాడు.
ఇంతలో ఆ వ్యక్తి చర్యను గమనించిన ఆ కోతి ఒక్కసారిగా అతడి మీదకు దూకి ఒక్కటిస్తుంది.దీంతో అతడు అదుపు తప్పి కిందపడతాడు.
మరలా అతడు తేరుకుని కోతి కోసం అటూ ఇటూ చూస్తాడు.అయితే అది అప్పటికే అక్కడి నుంచి మాయం అవుతుంది.ఈ ఘటన తిరువనంతపురంలో జరగగా ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయడంతో వెలుగు చూసింది.ఇప్పటికే ఈ వీడియో 7 లక్షల మందికిపైగా వీక్షించారు.
నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.కోతి జాన్‌సేన (డబ్ల్యూడబ్ల్యూఈ బాక్సర్)గా మారిందని ఒక్క పంచ్‌కే పడగొట్టేసిందని ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.
మీరు కూడా చూసి కామెంట్ చేయండి మారి!







