ప్రపంచ సోషల్ ఫొటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ తాజాగా తన యూజర్లకు శుభవార్తను మోసుకొచ్చింది.అవును, వారికోసం యాప్ లో మెరుగైన సేఫ్టీ ఫీచర్స్ తీసుకొచ్చింది.
ఇక ఈ అప్‌డేటెడ్ ఫీచర్లతో యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర, అసభ్యకర మెసేజ్‌లు పంపే ఇతర యూజర్లను ఈజీగా బ్లాక్ చేయవచ్చు.ఈ గురువారం ఇన్‌స్టాగ్రామ్ హెడ్ అయినటువంటి ఆడమ్ మోస్సేరి ఈ సేఫ్టీ టూల్స్‌ల అప్‌డేట్స్ గురించి తెలియ చేశారు.
ఈ కొత్త సేఫ్టీ టూల్స్ ఎలా వర్క్ అవుతాయి? అనే విషయం ఒకసారి పరిశీలిస్తే, యూజర్లు ఏదైనా బ్యాడ్ కామెంట్ చేయాలనుకున్నా లేదా అసభ్యకర మెసేజ్ పంపాలనుకున్నా ఇన్‌స్టాగ్రామ్ వెంటనే వారిని నడ్జ్ చేస్తుంది.అవును, మీరు విన్నది నిజమే.“హెల్ప్ కీప్ ఇన్‌స్టాగ్రామ్ ఏ సపోర్టివ్ ప్లేస్” అనే పాప్ అప్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ల మధ్య మంచి వాతావరణాన్ని కొనసాగించడానికి ఈ ఫీచర్ ఎంతగానో సహాయపడుతుంది.నడ్జెస్ అనేవి ఇన్‌స్టాగ్రామ్‌లో బాధించే కామెంట్స్‌కి చాలావరకు బ్లాక్ చేస్తాయి.
ఒక పోస్ట్ కింద కామెంట్ సెక్షన్‌లో ఇడియట్, స్టుపిడ్ వంటి అనుచిత పదాలను కూడా ఇవి నివారిస్తాయి అంటే అర్ధం చేసుకోండి.
యూజర్లు ఎవరినైనా బ్లాక్ చేస్తే వారు మళ్లీ ఆ యూజర్లను కాంటాక్ట్ అవ్వకుండా కూడా ఈ బ్లాకింగ్ ఫీచర్ ఉపయోగపడుతుంది.అలాగే కొత్త అకౌంట్స్ ఉపయోగించి వెంబడించడం/వేధించడం వంటి వాటికి కూడా చెక్ పెడుతుంది.ఈ ఫీచర్ ఆన్ చేసిన యూజర్లకు కామెంట్స్, మెసేజ్ రిక్వెస్ట్ నుంచి హానికరమైన కంటెంట్ ఆటోమేటిక్‌గా ఫిల్టర్ అయ్యి తెలియజేస్తుంది.
తద్వారా యూజర్ అలాంటివిషయాలను తేలికగా తెలుసుకుని అలెర్ట్ అవ్వొచ్చు.ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు క్రియేటర్ అకౌంట్స్‌కి హిడెన్ వర్డ్స్ డిటెక్షన్‌ను ఆటోమేటిక్‌గా ఆన్ చేయడాన్ని పరీక్షించడం ప్రారంభించింది.ఈ సెట్టింగ్‌లను ఎప్పుడైనా ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు.