ఆకాకరకాయలు.మామూలు కాకరకాయలతో పోలిస్తే చాలా రుచికరంగా ఉంటాయి.
చూడడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా కూడా ఆకాకరకాయలు తినడానికి మాత్రం బాగుంటాయి.ప్రస్తుత వర్షాకాలంలో ఆకాకరకాయలు(spiny gourd) విరివిగా లభ్యమవుతుంటాయి.
ఆరోగ్యానికి మంచిదని చాలామంది తరచూ ఆకాకరకాయను తింటూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తప్పక తెలుసుకోండి.
ఇంగ్లీష్ లో ఆకాకరకయను స్పైనీ గోర్డ్ అని పిలుస్తారు.
విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, ఇనుము, కాల్షియం (Vitamin A, Vitamin C, Vitamin B, Iron, Calcium)మరియు పొటాషియం వంటి పోషకాలకు ఆకాకరకాయ పవర్ హౌస్ లాంటిది.ఆరోగ్య పరంగా ఆకాకరకాయ అనేక ప్రమోజనాలను అందిస్తుంది.
ముఖ్యంగా కీళ్ల నొప్పులు (Joint pains)మరియు వాపులతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.ఆయా సమస్యలను తగ్గించడంలో ఆకాకరకాయ సహాయపడుతుంది.
ఈ కూరగాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది.అందువల్ల వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి ఆకాకరకాయ మంచి ఎంపిక అవుతుంది.
ఇది అతిగా తినడానికి తగ్గిస్తుంది.ఎక్కువ సమయం పాటు కడుపును నిండుగా ఉంచుతుంది.
అలాగే ఆకాకరకాయలో ఉండే ఫైబర్ కంటెంట్ చక్కెరల శోషణను నెమ్మదిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి మరియు ఆకస్మిక స్పైక్‌లను నివారించడానికి తోడ్పడుతుంది.ఆకాకరకాయలో ఉండే పీచు పదార్థం ఆరోగ్యకరమైన జీర్ణక్రియను (Digestion)ప్రోత్సహించడంలో.మలబద్ధకం సమస్యలను తరిమికొట్టడంలో హెల్ప్ చేస్తుంది.ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
అంతేకాదు ఆకాకరకాయలు ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తాయి.గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ అతిగా మాత్రం ఆకాకరకాయలను తినకూడదు.హెల్త్ కి మేలని తరచూ ఆకాకరకాయ తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు తలెత్తాయి.
అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో ఆకాకరకాయ సహాయపడుతుంది.కానీ మధుమేహం మందులు తీసుకునే వ్యక్తుల్లో ఇది హైపోగ్లైసీమియా (తక్కువ రక్తంలో చక్కెర) తలెత్తడానికి కారణం కావచ్చు.
కాబట్టి ఈ సీజనల్ కూరగాయను మితంగా మాత్రమే తీసుకోవాలి.