కింద ఉన్న ఫోటో చూసాక ఎవరికి అయినా హీరోయిన్ మీనా( Meena ) వయసు 47 అంటే నమ్మడం కష్టమే కానీ ఆమె ఈ ఏజ్ లో కూడా ఇంత బాగా మైంటైన్ చేయడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి.చాల మంది అందంగా, యంగ్ గా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జరీ లు చేయించుకుంటారు.
లేదా బ్యూటీ పార్లర్ లో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు.కానీ మీనా కి ఆ అవసరం లేదు ఎందుకంటే ఆమె పుట్టుకతోనే అందగత్తె.
చిన్నతనం నుంచి నేటి వరకు ఆమె అదే అందంతో కనిపిస్తున్నారు.హీరోయిన్ గా నటించడం మానేసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన మీనా ఇటీవలే భర్త మరణం నుంచి కోలుకుంటుంది.
తనలాగే తన కూతురుని కూడా హీరోయిన్ గా చూడాలని కలలు కంటుంది.

అందుకే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పటికే కూతురు నైనికా ( Nainika )ను పరిచయం చేసింది.ఇక ప్రస్తుతం తాను బుల్లి తెరపై బిజీ గా ఉంది.హీరోయిన్ గా కెరీర్ ముగిసిపోయిన తర్వాత మళ్లీ ఇండస్ట్రీ లో రాణించాలంటే తల్లి పాత్రలు మాత్రమే వస్తాయి.
ఇప్పటికే ఒకటి రెండు సినిమాల్లో తల్లి పాత్రల్లో కనిపించింది కూడా.కానీ వాటి కన్నా కూడా బుల్లి తెరపై రియాలిటీ షోలలో.కామెడీ షోలకు జడ్జ్ గా వ్యవహరించడం వల్ల డబ్బుకు డబ్బు, పేరుకు పేరు వస్తుంది.అందుకే మీనా ఈ మార్గాన్ని ఎంచుకుంది.
ప్రస్తుతం తెలుగు మరియు తమిళ్ టీవీ షో లలో పాల్గొంటూ తన ఉనికిని చాటుకుంటుంది.

ఇక ఇలా బుల్లితెర పై మాత్రమే కాకుండా తనకు నచ్చిన సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగానే ఉంది.2021 లో దృశ్యం( drushyam ) సీక్వెల్ తమిళ్ మరియు తెలుగు వర్షన్ లో నటించిన మీనా రజినీకాంత్ అన్నాతే సినిమాలో కూడా నటించింది.2022 లో బ్రో డాడీ సినిమాలో నటిచగా ఈ ఏడాది రౌడీ బేబీ చిత్రంలో నటిస్తుంది.ఇలా అటు బుల్లితెర ఇటు వెండితెర అన్నిట్లో మీనా తన ప్రభావాన్ని చూపిస్తుంది.ఇలా 47 ఏళ్ళ వయసులో ఈ అందం తో ఉన్న మీనా ను చూస్తే ఇంకా నిన్నటి తరం కుర్ర కారు గుండె ఆమె కోసం కొట్టుకుంటూనే ఉంటుంది.







