జీవితంలో సంతోషం సానుకూలత ఆరోగ్యం కోసం.. ఉప్పుతో ఈ నివారణ చేయండి..

వాస్తు శాస్త్రంలో చిన్న పెద్ద ఎన్నో రకాల చర్యలను వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు.ఈ చర్యలలో ఇంట్లో విస్తరించిన ప్రతికూల శక్తిని తొలగించడంలో చాలా ప్రభావంతంగా పరిగణించబడే కొన్ని చర్యలు ఉన్నాయి.

 For Happiness Positivity In Life.. Do This Remedy With Salt , Salt, Vastu, Healt-TeluguStop.com

ఈ పరిహారాలలో ఉప్పు కూడా ఒకటి.వాస్తు శాస్త్రంలో ఉప్పుకు సంబంధించిన కొన్ని చర్యలతో ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావంతమైన నివారణలలో ఒకటి.

ఉప్పుకు సంబంధించిన వాస్తు నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి నుంచి ప్రతికూల శక్తిని దూరం చేయడానికి ఇంటిని నీటితో తుడిచే సమయంలో ఆ నీటిలో చిటికెడు ఉప్పును కలపడం మంచిది.ఈ పరిహారం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది.

అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం చేస్తుంది.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది.

అంతే కాకుండా అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.అంతేకాకుండా తరచుగా ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు.ఈ సందర్భాలలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచడం మంచిది.ప్రతినెలా ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి.ఈ పరిహారంతో ఇంట్లోనే సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.వాస్తు దోషాలను తొలగించడానికి ఉప్పుకు సంబంధించిన కొన్ని నివారణలు చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి.

వాస్తు దోషం పోవాలంటే గాజు గిన్నెలో ఉప్పు వేసి ఇంటిలో ఒక మూలన పెట్టడం మంచిది.ప్రతినెలా ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి.ఈ పరిహారం ఇంట్లో ఆనందం, శాంతి,శ్రేయస్సుని తెస్తుంది.దీంతో ఇంటి వాస్తు దోషాలు కూడా దూరం అవుతాయి.ఇంకా చెప్పాలంటే మానసిక ఒత్తిడి, నిద్రలేమి, బద్దకం, అశాంతి ఉన్నవారు స్నానం చేసే నీటిలో కాస్త ఉప్పు వేసి స్నానం చేయడం మంచిది.ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube