శివాజీ రాజా( Shivaji )… ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నెగటివ్ పాత్రల్లో అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన చేయని పాత్ర అంటూ లేదు.
బుల్లితెరపై కూడా అనేక సీరియల్స్ లో నటించిన శివాజీ రాజా కెరియర్ మొత్తం పైన ఎన్నో వందల చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.మొదటినుంచి చిరంజీవి( Chiranjeevi ) అభిమానిగా ముద్రపడ్డ శివాజీ రాజా దాదాపు 35 ఏళ్లగా ఆయన్ని అభిమానిస్తూ వస్తున్నారట ఇప్పటి వరకు చిరంజీవికి సంబంధించిన ఒక్క సినిమాలో కూడా నటించలేదని ఆయన కుటుంబం నుంచి వచ్చిన హీరోల సినిమాల్లో కూడా ఇప్పటి వరకు తాను నటించలేదంటూ వాపోతున్నారు.

మొదటి నుంచి తనను అందరూ కూడా చిరు అభిమాని అని అనుకుంటారు.అందుకే ఏమో ఆయన కుటుంబమంతా నన్ను ఆదరిస్తారు కానీ మన వాడే కదా అనే సినిమాలు మాత్రమే ఇవ్వలేదు.ఒకవేళ ఇనేళ్ల పాటు ఆయన అభిమానిగా ఉన్నందుకు ఆయన సినిమాల్లో నటిస్తే నాకు తృప్తి ఉండేది.కానీ ఇకపై ఇచ్చిన నాలో ఆ కసి, తపన ఇప్పుడు లేదు అంటూ చెబుతున్నారు .తాను మొదటి నుంచి హీరోగా నటించానని నన్ను హీరోగా చూడాలని టాలీవుడ్ లో చాలా మంది కోరుకునేవారని నటుడు రంగనాథ్ ( Ranganath )మాత్రం తనని ఎప్పుడూ ఒక హీరో గానే చూశారని తనతో సినిమా చేయాలని చాలా తాపత్రయ పడ్డ అది కొన్ని కారణాల వల్ల కుదరలేదని చెప్పుకొచ్చారు.

తాను హీరోగా నటించిన మొదటి సినిమా పేద పేద వంశీ దర్శకత్వంలో శ్రీ కనకమహాలక్ష్మి డాన్స్ ఇన్ ట్రూప్( Sri Kanakamahalakshmi ) అని ఆ తర్వాత మొగుడ్స్ పెళ్లామ్స్ అనే సినిమా తనకు మంచి పేరు తీసుకొచ్చిందని అదే పేరుతో బుల్లి తెర పై ఒక ప్రోగ్రాం కూడా చేశానని చెప్పుకొచ్చారు.ఇక బుల్లితెరపై అమృతం, ఆలస్యం అమృతం విషం, కుచ్చి కూనమ్మ వంటి కొన్ని సీరియల్స్ లో నటించిన శివాజీ రాజా చిరంజీవి పిలిచి అవకాశమిచ్చినా కూడా ఇప్పుడు ఆయనతో నటించే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పారు.ఈ మధ్యకాలంలో అర్జున ఫాల్గుణ అనే సినిమాలో నటించిన శివాజీ రాజా తన కెరియర్ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నానని, సంతృప్తిగా కూడా ఉన్నానని చెప్తున్నారు.