టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మానవులు తమ పనులను చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నారు.ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రతీ చిన్న పనికి ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్‌పైనే ఆధారపడుతున్నారు.
వాటిలో గీజర్ కూడా ఒకటి అయిపోయింది.గీజర్ ద్వారా ప్రజలు నీటిని వేడి చేసుకుని వాటితో స్నానం చేస్తారు.
అయితే గీజర్లు వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.మరి అలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
స్విచ్ ఆఫ్ చేయాలి
గీజర్‌ని ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోతే చాలా డేంజర్ అని చెప్పొచ్చు.ఎందుకంటే గీజర్ ఎక్కువసేపు ఆన్‌లో ఉంచితే అది పేలిపోతుంది.
అందువల్ల దీనిని ఆఫ్ చేయడం మర్చిపోకుండా ఉండాలి.అవసరమైతే అలారం పెట్టుకుని దీన్ని ఆఫ్ చేయాలి.
ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే గీజర్లు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి వాటిని కొనుగోలు చేయడం చాలా సేఫ్.ఆటోమెటిగ్గా ఆఫ్ అయ్యే గీజర్ కొన్నా కూడా అప్పటికప్పుడు దాన్ని ఆఫ్ చేసుకోవడం మంచిది.
గీజర్ పాత మోడల్ అయినట్లయితే ఎప్పటికప్పుడు దాన్ని ఆఫ్ చేస్తూ ఉండాలి.తరచుగా సర్వీసింగ్, రిపేర్ కూడా చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు.

ఓన్ ఫిట్టింగ్ వద్దు

ఈ యూట్యూబ్ వీడియోలు చూసేసి గీజర్లను ఫిట్టింగ్ చేయాలనుకోవడం చాలా మూర్ఖత్వం.ఈ విషయంలో టెక్నీషియన్ల సహాయం తీసుకోవడం తప్పనిసరి.లేదంటే ఫిట్టింగ్ విషయంలో చిన్న పొరపాటు జరిగినా అవి షాక్ కొట్టే ప్రమాదం లేకపోలేదు.అలాగే గీజర్ వెంటనే పాడైపోయే అవకాశం కూడా ఎక్కువ.అందుకే సొంత తెలివిని ప్రదర్శించడం అనవసరం.అలానే ఏమైనా రిపేర్ వస్తే టెక్నీషియన్నే పిలిపించాలి.
బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్
గీజర్‌లో ఉండే బ్యూటేన్, ప్రొపేన్ అనే గ్యాసెస్ కార్బన్ డయాక్సైడ్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి.ఈ గ్యాస్ వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది కనుక ఆ గ్యాస్ ను బయటికి పంపించేలా బాత్‌రూమ్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఏర్పాటు చేసుకోవడం మంచిది.