ఆచార్య సినిమా రిలీజ్ అయి మూడు రోజులు పూర్తి చేసుకుంది.అయితే థియేటర్ ల దగ్గర కేవలం అభిమానుల కోలాహలం తప్ప ఇంకేమీ లేదు.
సినిమా అంచనాలను అందుకోవడం కాదు కదా .కనీసం ఒక సినిమాకు ఉండవలసిన లక్షణాలు కూడా లేవని సోషల్ మీడియాలో విమర్శలు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి.కొరటాల శివ తీసిన సినిమా ఇదేనా అంటున్నారు ప్రేక్షకులు.ఇక చిరంజీవి అభిమాన గణం గురించి ప్రత్యేకించి చేప్పనక్కర్లేదు… మెగా ఫ్యామిలీనికొరటాల శివ నిలువునా ముంచేశాడని కామెంట్స్ చేస్తున్నారు.
దీనితో గడిచిన మూడు రోజులుగా కలెక్షన్ లు మరీ దారుణంగా ఉన్నాయి.ఒక మెగా స్టార్ మూవీకి ఈ రేంజ్ లో కలెక్షన్ కు రావడం నిజంగా దురదృష్టం అంటూ ట్రేడ్ వర్గాలు సైతం విస్తుపోతున్నాయి.
ఇక ఈ సినిమాను పలు సినిమాలతో పోల్చి చూస్తున్నారు.గతంలో చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 ఒక రీమేక్ మూవీ అయినా ఆ సినిమాకు మొదటి రోజు 55 కోట్లు కలెక్షన్ లు వచ్చాయి.అయితే ప్రస్తుతం ఆచార్య పరిస్థితి మరీ మోసంగా ఉంది… ఇక ఖైదీ నంబర్ 150 తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి కి కూడా మొదట్లో సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా వంద కోట్లకు పైగానే కలెక్షన్ లు సాధించింది.అయితే పైన మనము చెప్పుకున్న రెండు సినిమాల కంటే కూడా ఎన్నో పాజిటివ్ లు ఈ సినిమా విషయంలో ఉన్నాయి.
ఒకవైపు మెగా మూవీ కావడం, మొదటి సారి మెగా ఫ్యామిలీ నుండి మల్టీ స్టారర్ అందులోనే చిరు చరణ్ ఇద్దరూ కలిసి నటించడం వంటి అంశాలు… మరియు ఇప్పటి వరకు అపజయం అంటే ఏమిటో తెలియని ఒక ముత్యం కానీ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను డీల్ చేయడంతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా అనుకున్నారు.
ఆ నమ్మకంతోనే మొదటి రోజు కలెక్షన్ లు 80 కోట్ల అయినా సాధిస్తుందని కలలు కన్నారు.అయితే వాస్తవ పరిస్థితి మాత్రం మింగుడు పడడం లేదు.మొదటి రోజు ఆచార్య సినిమాకు మధ్యాహ్నం షో నుండే ప్రేక్షకులు కరువయ్యారు.
ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారు కూడా సినిమా ఫలితం గురించి తెలిసి కాన్సిల్ చేసుకున్నారు.ఈ విధంగా రెండవ రోజు కొన్ని థియేటర్ లలో ఆచార్యను ఎత్తేశారు.
ఈ విషయం పట్ల అటు మెగా అభిమానులకు మరియు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు షాక్ తగిలినట్లయింది.అయితే ఇంతటి దారుణ ఫలితానికి ప్రేక్షకుల మీద కరోనా కారణంగా థియేటర్ లకు రాలేదు అన్న సాకు పెడదామన్నా వీలు లేదు.
ఎందుకంటే దీనికన్నా ముందు విడుదలైన పుష్ప, అఖండ, ఆర్ ఆర్ ఆర్, కే జి ఎఫ్ లాంటి సినిమాలు వసూళ్ల సునామీని సృష్టించాయి.
అయితే ప్రేక్షకులు సరైన సినిమా ఉంటే థియేటర్ లకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.కానీ మంచి సినిమాలు తీయడం రావాలి అంతే.స్టార్ హీరో సినిమా అయితే చాలు కలెక్షన్ లు వాటంతట అవే వస్తాయి అనడానికి వీలు లేకుండా ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఉంది.
కథ బాగుంటేనే సినిమాలు ఆడుతాయి.లేదంటే అన్నింటికీ ఆచార్య గతే పడుతుంది.అయితే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఇలాంటి దారుణమైన అవమానం జరిగితే ఇక ముందు వచ్చే మహేష్ బాబు , వెంకటేష్ లాంటి హీరోల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.అందుకే ఈ తరం డైరెక్టర్లకు ఒకటే చెబుతున్నాము… “కథే మీ హీరో”
.